Samantha : నిర్మాతగా సమంత ఫస్ట్ మూవీ అనౌన్స్.. ‘మా ఇంటి బంగారం’ అంటూ.. బర్త్‌డే స్పెషల్ పోస్టర్..

తాజాగా నేడు సమంత పుట్టిన రోజు సందర్భంగా తన నిర్మాణ సంస్థ నుంచి ఫస్ట్ సినిమాని ప్రకటిస్తూ టైటిల్ అనౌన్స్ చేసింది సమంత.

Samantha : నిర్మాతగా సమంత ఫస్ట్ మూవీ అనౌన్స్.. ‘మా ఇంటి బంగారం’ అంటూ.. బర్త్‌డే స్పెషల్ పోస్టర్..

Samantha Announced her first Movie as Producer on Her Birthday

Updated On : April 28, 2024 / 2:59 PM IST

Samantha : సమంత కొన్నాళ్ల నుంచి సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. మాయోసైటిస్ కి చికిత్స తీసుకుంటూ ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది సామ్. సినిమాలు చేయకపోయినా సోషల్ మీడియాలో, పాడ్ కాస్ట్ లతో రెగ్యులర్ గా యాక్టివ్ గా ఉంటుంది. అయితే సమంత గతంలో నిర్మాతగా మారుతున్నట్టు ప్రకటించింది.

సమంత కొన్నాళ్ల క్రితం ‘త్రాలల మూవింగ్ పిక్చర్స్’ అనే నిర్మాణ సంస్థని స్థాపించినట్టు, ఆ నిర్మాణ సంస్థ నుంచి త్వరలోనే మంచి మంచి సినిమాలు రాబోతున్నట్టు తెలిపింది. తాజాగా నేడు సమంత పుట్టిన రోజు సందర్భంగా తన నిర్మాణ సంస్థ నుంచి ఫస్ట్ సినిమాని ప్రకటిస్తూ టైటిల్ అనౌన్స్ చేసింది సమంత. ఈ సినిమాలో సమంతే హీరోయిన్ గా నటిస్తుంది.

Also Read : Anand Deverakonda : చిన్నప్పుడు మహేష్ బాబులా ట్రై చేశా.. విజయ్ దేవరకొండ తమ్ముడు మహేష్ బాబుకి ఇంత పెద్ద అభిమానా? 

‘మా ఇంటి బంగారం’ అనే టైటిల్ తో సమంత సినిమాని ప్రకటిస్తూ ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ లో సమంత చీరకట్టుకొని, మెడలో తాళిబొట్టుతో, చేతిలో తుపాకీ పట్టుకొని సీరియస్ గా ఉంది. దీంతో ఈ పోస్టర్ వైరల్ గా మారింది. ఇది లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలుస్తుంది. ఇక ఈ పోస్టర్ షేర్ చేస్తూ సమంత.. బంగారుమయం కావాలంటే అన్నీ మెరవాల్సిన అవసరం లేదు అని కోట్ తో పోస్ట్ చేసింది. దీంతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. ఈ సినిమా డైరెక్టర్, నటులు.. ఇలాంటి వివరాలేవీ ఇంకా ప్రకటించలేదు.