ప్రభాస్ 20 – ఫస్ట్ లుక్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన కొత్త సినిమాకు సంబంధించిన ఓ పిక్‌ను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రేక్షకులతో షేర్ చేసుకున్నాడు..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన కొత్త సినిమాకు సంబంధించిన ఓ పిక్‌ను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రేక్షకులతో షేర్ చేసుకున్నాడు..
డార్లింగ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అప్‌డేట్ వచ్చేసింది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘సాహో’ తర్వాత ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ పీరియాడికల్ లవ్ స్టోరిలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే కథానాయిక. ఇప్పటికే విదేశాల్లో కొంత భాగం చిత్రీకరణ జరిపారు.
ఈ సినిమాకు ‘జాన్’ అనే వర్కింగ్ టైటిల్ ప్రచారంలో ఉంది. ఇది ప్రభాస్ నటిస్తున్న 20వ సినిమా.. శుక్రవారం ఈ సినిమాలోని ఓ స్టిల్‌ని ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశాడు. జేబులో చేతులు పెట్టుకుని గోడపై ఉన్న ఫోటో కలెక్షన్‌ను చూస్తున్న ప్రభాస్ ఓ పక్కనుండి మాత్రమే కనిపిస్తున్న పిక్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
ఫస్ట్ లుక్ రిలీజ్ చేసే వరకు దీన్నే ఫస్ట్ లుక్ అనుకుంటాం అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ ఈ పిక్‌ను షేర్ చేసేస్తున్నారు. జనవరి 18 నుంచి హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.