సూట్‌లో ప్రభాస్ లుక్ కిరాక్.. డార్లింగ్ 20 మేకింగ్ వీడియో
ప్రభాస్ 20- మేకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..

ప్రభాస్ 20- మేకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘సాహో’ తర్వాత ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ పీరియాడికల్ లవ్ స్టోరిలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే కథానాయిక. ఇప్పటికే విదేశాల్లో కొంత భాగం చిత్రీకరణ జరిపారు. ఈ సినిమాకు ‘జాన్’ అనే వర్కింగ్ టైటిల్ ప్రచారంలో ఉంది. ఇది ప్రభాస్ నటిస్తున్న 20వ సినిమా.. హైదరాబాద్‌లో కొంత భాగం చిత్రీకరించారు.
తర్వాతి షెడ్యూల్ కోసం ఇటీవలే మూవీ టీమ్ యూరప్ వెళ్లారు. అక్కడ షూటింగ్ పలు పాపులర్ లొకేషన్లలో షూట్ జరుగుతోంది. దీనికి సంబంధించిన స్మాల్ మేకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో సూట్‌లో కనిపిస్తున్న ప్రభాస్ స్కేట్ బోర్డుపై మూవ్ అవుతున్నాడు.
గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ప్రభాస్ 21వ సినిమా వైజయంతి మూవీస్ బ్యానర్‌లో ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది చివర్లో షూటింగ్ ప్రారంభం కానుంది.