Adipurush Trailer : ఆదిపురుష్ ట్రైలర్ స్పెషల్ స్క్రీనింగ్.. ట్రైలర్‌లో గ్రాఫిక్స్ ఎలా ఉన్నాయి?

ఆదిపురుష్ ట్రైలర్ ని AMB లో స్పెషల్ స్క్రీనింగ్ చూసిన ఆడియన్స్ ట్విట్టర్ వేదికగా వారివారి రివ్యూలు ఇస్తున్నారు. ఈ ట్రైలర్ లోని గ్రాఫిక్స్..

Prabhas Adipurush Trailer graphics response at special screening

Adipurush Trailer : రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) శ్రీరాముడిగా నటిస్తున్న సినిమా ఆదిపురుష్. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ డైరెక్ట్ చేస్తున్న ఈ మైథిలాజికల్ మూవీలో కృతి సనన్ (Kriti Sanon) సీతగా, సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) రావణాసురిడిగా కనిపించబోతున్నారు. ఈ సినిమా ట్రైలర్ ని రేపు (మే 9) సాయంత్రం 5:04 నిమిషాలకు వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే నేడు కొంతమంది అభిమానులకు, మీడియా వర్గాలకు హైదరాబాద్ AMB మాల్ లో స్పెషల్ స్క్రీనింగ్ వేసి ఈ ట్రైలర్ ని చూపించారు.

Pawan Kalyan OG : మహారాష్ట్రలో జనసైనికులతో పవన్.. OG లుక్ అదిరిపోయిందిగా!

ఈ స్క్రీనింగ్ కి ప్రభాస్, కృతి సనన్, ఓం రౌత్ హాజరయ్యారు. దీంతో AMB మాల్ వద్ద రెబల్ అభిమానులు భారీ మొత్తంలో చేరుకొని సందడి చేశారు. ఇక మూవీ నుంచి వచ్చిన టీజర్ గ్రాఫిక్స్ విషయంలో భారీ ట్రోలింగ్ కి గురైన సంగతి తెలిసిందే. VFX వర్క్స్ కు మెరుగులు దిద్దెందుకు వెనక్కి వెళ్లిన చిత్ర యూనిట్.. ఇప్పుడు కొత్త ప్రింట్ తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. దీంతో ట్రైలర్ లోని గ్రాఫిక్స్ ఎలా ఉంది? ఏమన్నా చేంజెస్ జరిగాయా? లేదా అలానే ఉందా? అని అందరిలో ఆసక్తి నెలకుంది.

ఇక ఈ ట్రైలర్ ని AMB లో చూసిన ఆడియన్స్ ట్విట్టర్ వేదికగా వారివారి రివ్యూలు ఇస్తున్నారు. టీజర్ కంటే గ్రాఫిక్స్ వర్క్స్ ట్రైలర్ లో చాలా బాగున్నాయి అని అందరూ ట్వీట్స్ చేస్తున్నారు. ఒకసారి వారి రియాక్షన్స్ ని మీరు కూడా చూసేయండి.