Project K : అమెరికాలో ల్యాండ్ అయిన ప్రభాస్ అండ్ రానా.. డార్లింగ్ సన్నబడ్డాడంటున్న ఫ్యాన్స్..
ప్రాజెక్ట్ K గ్లింప్స్ రిలీజ్ చేయడానికి అమెరికా చేరుకున్న ప్రభాస్ అండ్ రానా. ఇక అక్కడి ఫోటోని నిర్మాతలు షేర్ చేయగా.. అది చూసిన కొందరు అభిమానులు ప్రభాస్ ఏంటి సన్నగా కనిపిస్తున్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Prabhas and Rana Daggubati landed in america to launch Project K Glimpse
Project K : ప్రభాస్ (Prabhas) హీరోగా తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ మూవీ ప్రాజెక్ట్ K. వైజయంతి మూవీస్ బ్యానర్ పై దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాని నాగ్ అశ్విన్ (Nag Ashwin) డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే (Deepika Padukone), దిశా పఠాని, కమల్ హాసన్.. ఇలా స్టార్ క్యాస్ట్ కనిపించబోతుంది. కాగా ఈ గురువారం (జులై 20) మూవీ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే.
అమెరికా కాలిఫోర్నియాలోని San Diegoలో నిర్వహించే ప్రతిష్టాత్మక ఈవెంట్ కామిక్ కాన్ లో ఈ గ్లింప్స్ ని రిలీజ్ చేయబోతున్నారు. ఈ ఈవెంట్ లో పాల్గొనబోయే మొదటి ఇండియన్ సినిమాగా ప్రాజెక్ట్ K చరిత్ర సృష్టించింది. ఇక ఈ కార్యక్రమానికి దర్శక నిర్మాతలతో పాటు ప్రభాస్, కమల్ హాసన్, దీపికా పదుకొనే పాల్గొనబోతున్నట్లు నిర్మాతలు ఆల్రెడీ తెలియజేశాడు. అయితే వీరితో పాటు బాహుబలి బ్రదర్ భల్లాలదేవ కూడా ఈ ఈవెంట్ కి వెళ్ళాడు. అమెరికాలోని ప్రభాస్ అండ్ రానా దగ్గుబాటి పిక్ ని చిత్ర యూనిట్ షేర్ చేసి అమెరికాలో ల్యాండ్ అయ్యినట్లు తెలియజేసింది.
Sai Dharam Tej : నా లవ్ ఫెయిల్యూర్స్‌ని కూడా ఫ్యామిలీలో ఆయనతోనే షేర్ చేసుకుంటా..
ఆ పిక్ లో ప్రభాస్ వెనుక నుంచి మాత్రమే కనిపిస్తున్నాడు. ఇక ఈ పిక్ చూసిన కొందరు అభిమానులు.. “ప్రభాస్ ఏంటి సన్నగా అయ్యినట్లు కనిపిస్తున్నాడు” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఫోటో చూస్తుంటే ప్రభాస్ నిజంగానే కొంచెం సన్నబడినట్లు తెలుస్తుంది. మరి ఈ చేంజ్ ఓవర్ దేని కోసమో తెలియాలి. ఇది ఇలా ఉంటే, ఈ మూవీ నుంచి దీపికా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు మేకర్స్. అది చూసిన ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్లోజ్ అప్ ఫోటో పెట్టి ఇది ఫస్ట్ లుక్ అంటున్నారు.. ఇది ఏమి అప్డేట్ అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. మరి మరో రెండు రోజుల్లో రిలీజ్ కాబోయే గ్లింప్స్ ఎంలాటి స్పందన ఎదురుకుంటుందో చూడాలి.
The men have landed in the USA ??. See you in San Diego on July 20th.#Prabhas @RanaDaggubati #ProjectK #WhatisProjectK pic.twitter.com/lclZRo4Srp
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 18, 2023