Prabhas Movie
Prabhas Movie : బాహుబలి సినిమా వచ్చిన తర్వాత చాలా మంది రెండో పార్ట్ అంటూ మొదలుపెట్టారు. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా, సినిమాకు రెండో పార్ట్ అవసరం లేకపోయినా కొన్ని సినిమాలు సీక్వెల్ లేదా ప్రీక్వెల్ ప్రకటిస్తున్నాయి. కొంతమంది స్టార్ హీరోలు మాత్రం తమ సినిమాలకు సీక్వెల్స్ ప్రకటించి మరింత హైప్ పెంచుతున్నారు. అలాంటి వాళ్లలో ప్రభాస్ ముందుంటాడు.
బాహుబలి సినిమాతో రెండు పార్టులు అని మొదలు పెట్టిన ప్రభాస్ ఆ తర్వాత కల్కి సినిమాకు, సలార్ సినిమాలకు కూడా సీక్వెల్స్ ప్రకటించాడు. కానీ ఆ రెండు సినిమాలు ఇప్పటికి కూడా మొదలుకాలేదు. అసలు అవి ఎప్పుడు వస్తాయో, ఎప్పుడు మొదలవుతాయి కూడా క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో మరో ప్రభాస్ సినిమాకు రెండో పార్ట్ ఉందట. అయితే అది సీక్వెల్ కాదు ప్రీక్వెల్.
Also Read : I Bomma : పోలీస్ కస్టడీలో ఐ బొమ్మ హెడ్.. బిగ్ ట్విస్ట్.. ఐ బొమ్మ సైట్ నుంచి మెసేజ్.. ఏముందంటే..
ఇంతకీ అదేం సినిమా అనుకుంటున్నారా. హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ఫౌజీ సినిమా. తాజాగా హను రాఘవపూడి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఫౌజీ సినిమాకు ప్రీక్వెల్ ఉండొచ్చు, ఆ ఆలోచన ఉంది అని అన్నారు. దీంతో ఫౌజీ సినిమాకు కూడా ఇంకో పార్ట్ ఉండటం ఖాయం అంటున్నారు.
పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో యుద్ధం నేపథ్యంలో, ఓ ప్రేమకథతో కూడా సినిమాగా ఫౌజీ తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇందులో కొత్త అమ్మాయి ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తుంది. 2026 చివర్లో ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఈ లెక్కన ప్రభాస్ చేతిలో అరడజను సినిమాలకు పైగా ఉండగా అందులో మూడు సినిమాలకు సంబంధిచి రెండో పార్ట్ ఉండటం గమనార్హం.