I Bomma : పోలీస్ కస్టడీలో ఐ బొమ్మ హెడ్.. బిగ్ ట్విస్ట్.. ఐ బొమ్మ సైట్ నుంచి మెసేజ్.. ఏముందంటే..
పోలీస్ కస్టడీలో ఉన్న రవిని విచారించడంతో సంచలన విషయాలు బయటపడ్డాయి. (I Bomma)
I Bomma
I Bomma : ఐ బొమ్మ, బప్పం వెబ్ సైట్స్ తో ఎన్నో సినిమాలని పైరసీ చేసి సినీ పరిశ్రమకు వందల కోట్ల నష్టం కలిగించిన ఇమ్మడి రవిని పోలీసులు ఇటీవల అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ పోలీసులు పైరసీ విషయాన్ని సీరియస్ గా తీసుకోవడమే కాక పాలీసులకు దమ్ముంటే పట్టుకొమ్మని రవి ఛాలెంజ్ విసరడంతో అతన్ని అరెస్ట్ చేసారు.
పోలీస్ కస్టడీలో ఉన్న రవిని విచారించడంతో సంచలన విషయాలు బయటపడ్డాయి. అతని దగ్గర దాదాపు 21 వేల సినిమాలు ఉన్నాయని, దాదాపు 50 లక్షల మంది డేటా ఉందని, దాన్ని డార్క్ వెబ్ కి అమ్ముకుందామని ట్రై చేసాడని, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి ఇల్లీగల్ గా 20 కోట్లు సంపాదించాడని పోలీసులు తెలిపారు. ఐ బొమ్మ సైట్ ని రవితోనే క్లోజ్ చేయించామని పోలీసులు తెలిపారు.
రవి పోలీసుల కస్టడీలో ఉన్న సమయంలో ఐ బొమ్మ సైట్ లో ఓ మెసేజ్ వచ్చింది. ఐ బొమ్మ సైట్ లో.. ఇటీవల మా గురించి వినే ఉంటారు. మొదటి నుంచి మా విశ్వసనీయ అభిమానిగా ఉన్నారు. ఏదేమైనా మా సేవలను దేశంలో శాశ్వతంగా నిలిపేస్తున్నాం. మా సేవలను నిలిపివేస్తున్నందుకు చింతిస్తున్నాం. అందుకు క్షమాపణలు కోరుతున్నాం అని పోస్ట్ చేసారు.
దీంతో ఐ బొమ్మ సైట్ పూర్తిగా క్లోజ్ అయినట్టే అని తెలుస్తుంది. అయితే ఐ బొమ్మ రవి పోలీసుల కస్టడీలో ఉన్నప్పుడు ఈ మెసేజ్ సైట్ లో ప్రత్యక్షమవడంతో పోలీసులే అతనితో పెట్టించారా? లేక బయట అతని టీమ్ పెట్టిందా అని చర్చ సాగుతుంది.

Also Read : I Bomma Ravi : ఇలాంటి వాడికా సపోర్ట్ చేసేది.. ఐ బొమ్మ రవి ఎలాంటి వాడో తెలుసా? తండ్రి చెప్పిన సంచలన విషయాలు..
