I Bomma Ravi : ఇలాంటి వాడికా సపోర్ట్ చేసేది.. ఐ బొమ్మ రవి ఎలాంటి వాడో తెలుసా? తండ్రి చెప్పిన సంచలన విషయాలు..
రవి తండ్రి కూడా మీడియాతో మాట్లాడుతూ తన కొడుకు గురించి సంచలన విషయాలు తెలిపాడు. (I Bomma Ravi)
I Bomma Ravi
I Bomma Ravi : ఐ బొమ్మ, బప్పం వెబ్ సైట్స్ తో ఎన్నో సినిమాలని పైరసీ చేసి సినీ పరిశ్రమకు వందల కోట్ల నష్టం కలిగించాడు ఇమంది రవి. రిలీజ్ అయిన రోజే సినిమాలను తన వెబ్ సైట్స్ లో పెట్టాడు. పోలీసులకు చిక్కకుండా విదేశాల్లో దాక్కొని ఈ పనులన్నీ చేసేవాడు రవి. పోలీసులు పైరసి మీద సీరియస్ అవ్వడంతో వాళ్ళకే సవాల్ విసిరాడు. దీంతో పోలీసులు ఎట్టకేలకు ఐ బొమ్మ రవిని అరెస్ట్ చేసారు. భార్యతో విడాకుల నేపథ్యంలో ఇండియాకు రావడంతో అతన్ని అరెస్ట్ చేసారు పోలీసులు.
అయితే కొంతమంది సోషల్ మీడియాలో ఐ బొమ్మ రవిని సపోర్ట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. పేద వాళ్లకు ఫ్రీగా సినిమాలు చూపించాడు అంటూ పలువురు అతనిపై సింపతీ తీసుకురావడానికి ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో రవిని విచారించిన పోలీసులు సంచలన విషయాలు బయటపెట్టారు. అలాగే రవి తండ్రి కూడా మీడియాతో మాట్లాడుతూ తన కొడుకు గురించి సంచలన విషయాలు తెలిపాడు.
Also Read : Rasha Thadani : మహేష్ కొడుకు కోసం.. బాలీవుడ్ హీరోయిన్ కూతురు.. బాబాయ్ కంటే ముందే బాలీవుడ్ కి జయకృష్ణ..
రవి వద్ద దాదాపు 21 వేల సినిమాలు ఉన్నాయని, దాదాపు 50 లక్షల మంది డేటా ఉందని, దాన్ని డార్క్ వెబ్ కి అమ్ముకుందామని ట్రై చేసాడని పోలీసులు తెలిపారు. అలాగే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి ఇల్లీగల్ గా 20 కోట్లు సంపాదించాడని తెలిపారు.
I Bomma Ravi
వైజాగ్ లో నివాసం ఉంటున్న రవి తండ్రి ఇమంది చిన అప్పారావు BSNL రిటైర్డ్ ఎంప్లాయ్. రవి అరెస్ట్ అవడంతో ఆయన రవి గురించి మీడియాతో మాట్లాడుతూ.. నేను డిగ్రీ వరకు చదివించాను. ఆంద్ర యూనివర్సిటీలో కూడా ఏదో చదివాడు. ఏం చదివాడో చెప్పలేదు. అవసరమైతే నేను ఫోన్ చేస్తే పలుకుతాడు. లేకపోతే వాడికి అవసరం అయితే వాడు చేస్తాడు. అది కూడా ఎప్పుడో ఒకసారి. అతని లైఫ్ అతను బతుకుతున్నాడు. నా బాధలు నావి. పోలీసులకు సవాలు విసిరేంత పెద్దోడు అవ్వలేదు. తప్పు చేసినప్పుడు నోరు మూసుకొని ఉండాలి. చట్టం ఊరుకోదు. ఏదో ఒకరోజు దొరుకుతాడు.
Also See : Varanasi Title Launch Event : మహేష్ – రాజమౌళి ‘వారణాసి’ టైటిల్ లాంచ్ గ్రాండ్ ఈవెంట్.. ఫోటోలు చూశారా?
నేను ఫోన్ చేస్తే సీరియస్ గా మాట్లాడతాడు. వాళ్ళ అమ్మతో పడ్డాను బాధలు. ఆ దరిద్రం వదిలింది అనే సరికి ఈ తలనొప్పి వచ్చింది. ఏం చేద్దాం. అతను డబ్బులు ఏమి పంపడు. వాడు పంపినా నాకు అక్కర్లేదు. వాడు ఇచ్చినా రూపాయి కూడా వద్దు. వాడు అంతకుముందు నన్ను డబ్బులు అడిగాడు. లోన్ పెట్టి డబ్బులు ఇచ్చాను మన పిల్లలు అని. కానీ నాకు ఎపుడూ డబ్బులు ఇవ్వలేదు. కోట్లు సంపాదించాడని అందరూ చెప్తుంటేనే వింటుంటాను. వైజాగ్ నుంచి వెళ్ళిపోయి 15 ఏళ్ళు అయింది. వాడు ఏం చేసినా నాకేం సంబంధం లేదు
రవి ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు. నేను చూసిన సంబంధాలు చేసుకోలేదు. పెళ్లి చేసుకున్నాడు. కోడలు మంచిది. కోడలు కూడా బాగానే ఉండేది. నేను బాగానే చూసుకున్నాను. ఒకసారి గొడవపడ్డాం మీరు రండి అని కోడలు నాకు ఫోన్ చేసి రమ్మంది. నాకు కళ్ళు ఆపరేషన్ జరిగి వెళ్ళలేదు. మీరు మీరు మాట్లాడుకోండి అన్నాను. వాళ్లకు కూతురు కూడా ఉంది. ప్రేమించి పెళ్లి చేసుకున్నాక ఇలా గొడవలు ఏంటి? చదువుకున్నారు గా, చిన్న పాప కూడా ఉంది మాట్లాడుకోండి అని అన్నాను. కానీ విడాకులకు వెళ్లారని తెలిసింది అంటూ తెలిపారు.
పోలీసులు, రవి తండ్రి మాట్లాడిన మాటలు వైరల్ అవ్వడంతో ఇలాంటి వాడికా సపోర్ట్ చేసింది, సినిమాలు ఫ్రీగా చూపించినా అతను క్రిమినలే అని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
