జైలు నుంచి బయటకు.. సీక్రెట్‌గా హీరోయిన్ పెళ్లి!

  • Updated on- March 24, 2021 / 09:05 PM IST

Prabhas Bujjigadu Heroine Sanjana Galrani Married

దక్షిణాది సినిమాల్లో హీరోయిన్‌గా రాణించిన కన్నడ స్టార్ సంజన గల్రానీ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యింది. డ్రగ్‌ మాఫియాతో సంబంధాలు ఉన్నాయంటూ అరెస్ట్‌ అయిన ఈ అమ్మడు.. బెయిల్‌పై విడుదలై.. పెళ్లి చేసుకుంది. సంజనా గల్రాని కర్ణాటకలో పేరు డాక్టర్‌ పాషాను పెళ్లి చేసుకోగా.. పాషాకు పలు వ్యాపారలు కూడా ఉన్నాయి.

సంజనా గల్రాని పెళ్లికి పరిమిత సంఖ్యలో స్నేహితులు, బంధులు హాజరు కాగా.. పెళ్లితో పాటు సంజనా డిజిటల్‌ రంగంలోకి అడుగు పెడుతుంది. ఆత్మనిర్బర్‌ పేరుతో నటీనటుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తోంది. త్వరలో తన డిజిటల్‌ మీడియాకు సంబంధించిన పేరు, వివరాలను వెల్లడిస్తానని ప్రకటించింది.

తెలుగులో పూరి జగన్నాథ్‌, ప్రభాస్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘బుజ్జిగాడు’ సినిమాలో నటించి గుర్తింపు తెచ్చుకున్న సంజన.. ‘సత్యమేవ జయతే’, ‘అవును 2’, ‘సర్దార్ గబ్బర్ సింగ్’ వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించింది. తెలుగులో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో కన్నడ పరిశ్రమకే పరిమితం అవ్వగా.. ఇటీవల డ్రగ్స్ కేసులో మూడు నెలలపాటు జైల్లో ఉండి బెయిల్‌పై బయటకు వచ్చింది.