Prabhas Doing Continuously Two Movie Shootings at a Time
Prabhas : అందరు హీరోలూ పాన్ ఇండియా హీరోలయ్యాక తాపీగా 2 సంవత్సరాలకో సినిమా చేస్తుంటే ప్రభాస్ మాత్రం ఒకేసారి 2 సినిమాలు షూట్ చేస్తూ డబుల్ డ్యూటీ చేస్తున్నారు. రాజాసాబ్, ఫౌజి అయిపోతే ఈ ఇబ్బంది లేకుండా ఒక్క సినిమా మీదే ఫోకస్ చేస్తాడనుకుంటే లేటెస్ట్ గా నాగ్ అశ్విన్ ఇచ్చిన స్టేట్ మెంట్ తో ప్రభాస్ కి మళ్లీ 2 సినిమాల షటిల్ సర్వీస్ తప్పేలా కనిపించడం లేదు.
పాపం ప్రభాస్.. నిర్మాతల కమిట్మెంట్స్ కి బలైపోతున్నాడు అని తెగ బాధపడుతున్నారు ఫ్యాన్స్. నిర్మాతలు సినిమాని ఈ సంవత్సరమే స్టార్ట్ చేస్తాం, నెక్ట్స్ ఇయర్ రిలీజ్ చేస్తాం అంటూ మాట ఇచ్చేస్తున్నారు. ఆ దెబ్బకి ప్రభాస్ కి ప్రెజర్ పెరిగిపోతోందంటున్న టాక్ నడుస్తోంది. లేటెస్ట్ గా కల్కి 2 షూటింగ్ ఈ సంవత్సరమే అని చెప్పడంతో ప్రభాస్ మళ్లీ 2 సినిమాలు ప్యార్లల్ గా చెయ్యాల్సిందేనని తెలుస్తోంది.
Also Read : Chiranjeevi : చిరంజీవి ఇంటికి క్యూ కడుతున్న దర్శకులు.. కథలను వింటూ సినిమాలు లైన్లో పెడుతున్న మెగాస్టార్..
ప్రభాస్ ఇప్పటికే రాజాసాబ్, ఫౌజి సినిమాలతో బిజీగా ఉన్నారు. ఫౌజి స్టార్ట్ చెయ్యకముందే కల్కి, రాజాసాబ్ కలిపి షూట్ చేశారు. అయితే కల్కి రిలీజై రాజాసాబ్ మిగిలింది. ఇప్పుడు రాజాసాబ్ కి ఫౌజి యాడ్ అయ్యింది. ఇక రాజాసాబ్ షూటింగ్ కంప్లీట్ అయిపోతోంది. ఫౌజి కూడా సమ్మర్ నాటికి ఓ కొలిక్కి వచ్చేస్తుంది. ఇక ప్రభాస్ సందీప్ రెడ్డితో చేసే స్పిరిట్ మీదే ఫోకస్ ట్రేట్ చెయ్యొచ్చు అనుకుంటున్నారు ఫ్యాన్స్ .
అయితే అక్కడే కల్కి 2 దెబ్బకొట్టింది. స్పిరిట్ షూటింగ్ తో పాటే కల్కి 2ని కూడా షూట్ చెయ్యాల్సి ఉంటుంది ప్రభాస్. ఎందుకంటే కల్కి 2ని ప్రభాస్ డేట్స్ చూసుకుని ఈ సంవత్సరమే స్టార్ట్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు నాగ్ అశ్విన్. స్పిరిట్ తో పాటు కల్కి 2 స్టార్ట్ చేస్తే నెక్ట్స్ ఇయర్ సమ్మర్ నాటికి స్పిరిట్ కంప్లీట్ అయిపోతుంది. ఈ లోపు కల్కి 2 తోపాటు సలార్ 2 షూట్ కూడా మొదలయ్యే చాన్సుంది. ఈ లెక్కన ప్రభాస్ ఇప్పట్లో సోలో సినిమాతో ట్రావెల్ అయ్యే చాన్స్ లేనట్టే కనిపిస్తోంది.
Also Read : Betting Apps : బెట్టింగ్ యాప్స్ ఎఫెక్ట్.. రానా, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మితో పాటు వాళ్లందరిపై కేసు నమోదు..
ప్రతి సారీ 2 సినిమాలతో షటిల్ సర్వీస్ చెయ్యడం తప్పేలా లేదని ఫీలవుతున్నారు ఫ్యాన్స్. మరో వైపు కొంతమంది మాత్రం మా రెబల్ స్టార్ కాబట్టి ఒకే సారి రెండు రెండు సినిమాలు చేస్తూ కెరీర్ ని పరుగులు పెట్టిస్తున్నారు అంటూ సంతోషపడుతున్నారు. మరి ఈ సినిమాలు షూటింగ్ చేస్తున్నారు కానీ రిలీజ్ విషయంలో కూడా అంతే స్పీడ్ చూపిస్తే బావుండంటూ ఫీలవుతున్నారు అభిమానులు.