Chiranjeevi : చిరంజీవి ఇంటికి క్యూ కడుతున్న దర్శకులు.. కథలను వింటూ సినిమాలు లైన్లో పెడుతున్న మెగాస్టార్..
యువ డైరెక్టర్‌లతో సినిమాలు చేసేందుకు మెగాస్టార్ ఆసక్తి చూపిస్తున్నాడు.

Megastar Chiranjeevi Listening Movie Stories from Young Directors
Chiranjeevi : సెకండ్ ఇన్నింగ్స్‌లో బుల్లెట్ రేంజ్ స్పీడ్ చూపిస్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి. రాబోయే సినిమాలపై భారీ కసరత్తు చేస్తున్నాడు. ఇప్పటికే చేతి నిండా సినిమాలు ఉన్నాయి. దీనికి తోడు వరుసగా కొత్త కథలు వింటున్నాడు. దీంతో ఆదివారం కూడా మెగాస్టార్‌కు తీరిక లేకుండా పోతుందని ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో గాసిప్స్ వినిపిస్తున్నాయ్.
యువ డైరెక్టర్‌లతో సినిమాలు చేసేందుకు మెగాస్టార్ ఆసక్తి చూపిస్తున్నాడు. దీంతో తమ లక్ టెస్ట్ చేసుకునేందుకు స్టోరీలు చేతిలో పట్టుకొని మెగాస్టార్ ఇంటికి క్యూ కడుతున్నారట యంగ్ డైరెక్టర్లు. ప్రతీ కథ వింటున్న చిరు ఆచితూచి సెలక్ట్ చేసుకుంటున్నాడని టాక్. కథలు చేతిలో పట్టుకొని మెగాస్టార్ వెంటపడుతున్న డైరెక్టర్స్‌లో కొంతమందికి అవకాశాలు కన్ఫార్మ్ అవగా మరికొందరు మాత్రం వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నారు.
Also Read : Jack Song : సిద్ధూ జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య ‘జాక్’ సినిమా నుంచి.. ముద్దు సాంగ్ రిలీజ్..
ప్రస్తుతం వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంభర సినిమా చేస్తున్న మెగాస్టార్ తర్వాత అనిల్ రావిపూడితో ఓ కామిడీ ఎంటర్‌టైనర్ చేయబోతున్నాడు. దీని తర్వాత దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెలతో మరో సినిమా చేయబోతున్నాడు. ఇక వాల్తేరు వీరయ్యలాంటి బ్లాక్‌బస్టర్ ఇచ్చిన డైరెక్టర్ బాబీతోనూ చిరు ఓ మూవీ కమిట్ అయ్యాడని టాక్. ఇప్పుడు మరో యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరితోనూ సినిమా కన్ఫార్మ్ చేసినట్లు తెలుస్తోంది.
అయితే బాబీ, వెంకీ అట్లూరి సినిమాలు కాస్త ఆలస్యం అయ్యే చాన్స్ ఉందంట. వెంకీ కుడుముల, కళ్యాణ్ కృష్ణలతో కూడా సినిమాలు ఉన్నాయని వార్తలు వచ్చాయి కానీ అవి ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు అని తెలుస్తుంది. చిరంజీవి యువ దర్శకుల కథలు వింటుండటంతో చిరుని ప్రేరణగా తీసుకొని సినీ పరిశ్రమలోకి వచ్చిన దర్శకులంతా చిరు అపాయింట్మెంట్ కోసం ఎదురుచూస్తున్నారు.
Also Read : Nithiin – Mallareddy : నితిన్ తో కలిసి స్టేజిపై ఐటెం సాంగ్ కు డ్యాన్స్ వేసిన మల్లారెడ్డి.. వీడియో వైరల్..
ఒక్క చాన్స్ అంటూ చిరుకు కథలు వినిపిస్తున్న డైరెక్టర్లు పెద్ద ప్లానే వేశారట. చిరుతో సినిమా చేసి సక్సెస్ కొట్టి తర్వాత చరణ్ దగ్గరకి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారట. మెగాస్టార్‌కి హిట్ ఇస్తే చరణ్‌తో సినిమా చేయడానికి ఈజీ అవుతుందని లెక్కలేసుకుంటున్నారని తెలుస్తోంది. మరి ఎంతమంది మెగాస్టార్‌కి హిట్ ఇస్తారో, లేదా చిరునే తనకు సెట్ అవ్వకపోతే చరణ్ దగ్గరికి పంపిస్తారో చూడాలి.