Nithiin – Mallareddy : నితిన్ తో కలిసి స్టేజిపై ఐటెం సాంగ్ కు డ్యాన్స్ వేసిన మల్లారెడ్డి.. వీడియో వైరల్..

నితిన్ తో కలిసి అదిదా సర్ ప్రైజు అంటూ మల్లారెడ్డి వేసిన స్టెప్స్ మీరు కూడా చూసేయండి..

Nithiin – Mallareddy : నితిన్ తో కలిసి స్టేజిపై ఐటెం సాంగ్ కు డ్యాన్స్ వేసిన మల్లారెడ్డి.. వీడియో వైరల్..

MLA Malla Reddy Dance with Hero Nithiin for Robinhood Movie Song Video goes Viral

Updated On : March 20, 2025 / 9:36 AM IST

Nithiin – Mallareddy : మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి అప్పుడప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటారు. తాజాగా స్టేజిపై హీరోతో కలిసి డ్యాన్స్ వేసి వైరల్ అవుతున్నారు. గతంలో కూడా పలుమార్లు మల్లారెడ్డి డ్యాన్సులు చేసి వైరల్ అయ్యారు. నితిన్ త్వరలో రాబిన్ హుడ్ సినిమాతో రానున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మల్లారెడ్డి కాలేజీలో మూవీ టీమ్ పాల్గొంది.

Also Read : Parthiban – Seetha : ఈ స్టార్స్ ఇద్దరూ భార్యాభర్తలు అని తెలుసా..? కానీ విడాకులు తీసుకొని.. ఆమె మీద ప్రేమతో ఇంకో పెళ్లి చేసుకోకుండా..

దీంతో హీరో నితిన్, మల్లారెడ్డి కలిసి స్టేజిపై రాబిన్ హుడ్ సినిమాలోని ఐటెం సాంగ్ అదిదా సర్ ప్రైజు.. సాంగ్ కి డ్యాన్స్ వేశారు. ఇద్దరూ సరదాగా డ్యాన్స్ వేసి హగ్ ఇచ్చుకున్నారు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. మరోసారి మల్లారెడ్డి స్టేజిపై అదరగొట్టేసాడు అని కామెంట్స్ చేస్తున్నారు. నితిన్ తో కలిసి అదిదా సర్ ప్రైజు అంటూ మల్లారెడ్డి వేసిన స్టెప్స్ మీరు కూడా చూసేయండి..

నితిన్, శ్రీలీల జంటగా రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్ కీలక పాత్రల్లో వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన రాబిన్ హుడ్ సినిమా మార్చ్ 28న రిలీజ్ కానుంది.