Parthiban – Seetha : ఈ స్టార్స్ ఇద్దరూ భార్యాభర్తలు అని తెలుసా..? కానీ విడాకులు తీసుకొని.. ఆమె మీద ప్రేమతో ఇంకో పెళ్లి చేసుకోకుండా..

పార్తీబన్, నటి సీత ఒకప్పుడు భార్యాభర్తలు అని చాలా తక్కువ మందికి తెలుసు.

Parthiban – Seetha : ఈ స్టార్స్ ఇద్దరూ భార్యాభర్తలు అని తెలుసా..? కానీ విడాకులు తీసుకొని.. ఆమె మీద ప్రేమతో ఇంకో పెళ్లి చేసుకోకుండా..

Actor Director Parthiban Revealed about Divorce with Actress Seetha

Updated On : March 20, 2025 / 9:02 AM IST

Parthiban – Seetha : తమిళ్ స్టార్ డైరెక్టర్, నటుడు పార్తీబన్ అనేక తమిళ్ డబ్బింగ్ సినిమాలతో తెలుగు వాళ్లకు కూడా దగ్గరయ్యాడు. నటుడిగా కెరీర్ మొదలుపెట్టిన పార్తీబన్ ఆ తర్వాత దర్శకుడిగా, సింగర్ గా, పాటల రచయితగా పాపులర్ అయ్యారు. అయితే పార్తీబన్, నటి సీత ఒకప్పుడు భార్యాభర్తలు అని చాలా తక్కువ మందికి తెలుసు.

ఒకప్పుడు హీరోయిన్ గా సినిమాలు చేసిన సీత ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూ బిజీగానే ఉంది. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడలో అనేక సినిమాల్లో సీత నటించింది. పార్తీబన్ డైరెక్టర్ గా మొదటి సినిమాలో సీత హీరోయిన్. అప్పుడే వాళ్లకు పరిచయం అయి ఆ తర్వాత ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు పుట్టాక 2001లో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. ఓ అబ్బాయిని కూడా దత్తత తీసుకున్నారు ఈ జంట.

Also Read : Upasana – Janhvi Kpaoor : జాన్వీ కపూర్ కి రామ్ చరణ్ భార్య స్పెషల్ గిఫ్ట్.. RC16 సెట్స్ లో ఏం వండుతున్నారు..

అయితే సీత పార్తీబన్ తో విడాకులు తర్వాత మరొకర్ని పెళ్లి చేసుకుంది. 2016లో అతనితో కూడా విడాకులు తీసుకుంది. కానీ పార్తీబన్ మాత్రం సీతతో విడిపోయాక ఆమె మీద ప్రేమతో ఇంకో పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోయాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సీత గురించి ప్రస్తావన రావడంతో పార్తీబన్ ఈ విషయం తెలిపాడు.

పార్తీబన్ మాట్లాడుతూ.. డైరెక్టర్ గా నా మొదటి సినిమా పుదియా పాడైలో సీత హీరోయిన్ గా నటించడం వల్లే హిట్ అయింది. సీతతో పెళ్లయ్యాక ఆమె సినిమాలు చేయను అని చెప్పింది. నేను సరే అన్నాను. కొన్నాళ్ల తర్వాత ఆమె నటిస్తాను అని చెప్పడంతో ఓకే అన్నాను. కొన్ని కారణాల వల్ల మేము పరస్పర అంగీకారంతోనే విడిపోయాము. అప్పుడు మేము కలిసి ఉన్న ఇంటిని అమ్మేసాం. ఆ తర్వాత నేను మళ్ళీ ఇల్లు కొనుక్కోలేదు. ఇప్పటికి అద్దె ఇంట్లోనే ఉంటున్నాను. నేను మళ్ళీ పెళ్లి కూడా చేసుకోలేదు. ఆమెతో విడిపోయినా సీతను ఇప్పటికి గౌరవిస్తాను, ప్రేమిస్తాను. అందుకే ఇన్నేళ్లు అయినా మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. నా భార్యగా సీతకు స్థానం ఇచ్చాను. దాన్ని మరొకరికి మళ్ళీ ఇవ్వలేను. ఆమెతో ఇప్పుడు టచ్ లో లేను. ఆమె తల్లి చనిపోయినప్పుడు మాత్రం ఓ సారి వెళ్లి కలిసొచ్చాను అని తెలిపారు.