Upasana – Janhvi Kpaoor : జాన్వీ కపూర్ కి రామ్ చరణ్ భార్య స్పెషల్ గిఫ్ట్.. RC16 సెట్స్ లో ఏం వండుతున్నారు..

తాజాగా రామ్ చరణ్ భార్య ఉపాసన జాన్వీ కపూర్ కి ఓ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.

Upasana – Janhvi Kpaoor : జాన్వీ కపూర్ కి రామ్ చరణ్ భార్య స్పెషల్ గిఫ్ట్.. RC16 సెట్స్ లో ఏం వండుతున్నారు..

Ram Charan Wife Upasana Special Gift to Janhvi Kapoor Photo goes Viral

Updated On : March 20, 2025 / 7:53 AM IST

Upasana – Janhvi Kpaoor : రామ్ చరణ్ – జాన్వీ కపూర్ ప్రస్తుతం బుచ్చిబాబు సాన దర్శకత్వంలో RC16 సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అప్పుడప్పుడు రామ్ చరణ్ ఎయిర్ పోర్ట్ దగ్గర కనిపిస్తుండటంతో ఈ సినిమా లుక్స్ లీక్ అయి అదిరిపోయింది అంటున్నారు ఫ్యాన్స్. దసరాకు ఈ సినిమా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

Also Read : L2 Empuraan : లూసిఫర్ 2 ట్రైలర్ వచ్చేసింది.. ఖురేషి అబ్రమ్ ఈజ్ బ్యాక్.. ట్రైలర్ అదిరిందిగా..

తాజాగా రామ్ చరణ్ భార్య ఉపాసన జాన్వీ కపూర్ కి ఓ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఉపాసన, చిరంజీవి భార్య సురేఖ కలిసి అత్తమ్మాస్ కిచెన్ అని ఇన్‌స్టంట్ ఫుడ్ బిజినెస్ చేస్తున్న సంగతి తెలిసిందే. RC16 సినిమా మొదలయిన సమయంలో జాన్వీ కపూర్ చరణ్ ఇంటికి వెళ్ళింది. అప్పుడు ఉపాసన ఈ అత్తమ్మాస్ కిచెన్ నుంచి పలు ఇన్‌స్టంట్ ఫుడ్ ప్యాకెట్స్ ఉన్న గిఫ్ట్ బాక్స్ జాన్వీకి ఇచ్చింది.

Ram Charan Wife Upasana Special Gift to Janhvi Kapoor Photo goes Viral

జాన్వీకి ఉపాసన ఈ గిఫ్ట్ బాక్స్ ఇచ్చిన ఫోటోని ఇప్పుడు అత్తమ్మస్ కిచెన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఈ ఫోటో పోస్ట్ చేసి RC16 సెట్స్ లో ఏం వండుతున్నారో తెలుసా.. వెయిట్ చేయండి అంటూ పోస్ట్ చేసారు. దీంతో త్వరలో RC16 సెట్స్ నుంచి ఉపాసన ఏదైనా మేకింగ్ వీడియో షేర్ చేస్తుందేమో అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Athamma`s Kitchen (@athammaskitchen)