The Deal Movie : ప్రభాస్ ఫస్ట్ సినిమా ఫ్రెండ్.. హీరోగా ‘ది డీల్’ సినిమా.. రిలీజ్ ఎప్పుడంటే..
హనుకోట్ల ఇప్పుడు హీరోగా, దర్శకుడిగా ది డీల్ అనే సినిమాతో రాబోతున్నాడు.

Prabhas Eshwar Movie Friend Hanu Kotla The Deal Movie Pre Release Event Happened
The Deal Movie : ఈశ్వర్ సినిమాలో ప్రభాస్ పక్కన ఉండే ఫ్రెండ్స్ లో మూగ పాత్ర చేసింది హను కోట్ల అనే నటుడు. ఆ తర్వాత హను కోట్ల హైదరాబాద్ లోని శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో యాక్టింగ్, డైరెక్షన్ కోర్సుల్లో ఉపాధ్యాయుడిగా చేస్తూ వచ్చాడు. అనేక నాటకాల్లో నటుడిగా, దర్శకుడిగా కూడా చేసాడు. అయితే హనుకోట్ల ఇప్పుడు హీరోగా, దర్శకుడిగా ది డీల్ అనే సినిమాతో రాబోతున్నాడు. సిటడెల్ క్రియేషన్స్, డిజిక్వెస్ట్ బ్యానర్స్ పై డాక్టర్ అనితరావు సమర్పణలో హెచ్ పద్మా రమకాంతరావు, రామకృష్ణ కొళివి నిర్మాణంలో తెరకెక్కుతున్న సినిమా ది డీల్. ఈ సినిమాలో హీరోగా నటిస్తూనే దర్శకత్వం వహించాడు హనుకోట్ల. ఈ సినిమాలో చందన, ధరణి ప్రియ హీరోయిన్స్ గా నటిస్తుండగా రవిప్రకాష్, శ్రీవాణి, సురభి లలిత, సమీర్ దత్తా.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు.
ది డీల్ సినిమా అక్టోబర్ 18న థియేటర్స్ లో విడుదల కాబోతుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో నిర్మాత బసిరెడ్డి మాట్లాడుతూ.. ది డీల్ సినిమా చూశాను. నెక్ట్ సీన్ ఏం జరుగుతుందో అనే క్యూరియాసిటీతో సినిమా ఆకట్టుకుంటుంది అని తెలిపారు. హీరోయిన్ ధరణి ప్రియ మాట్లాడుతూ.. తీన్మార్ వార్తల్లో రాధగా నన్ను ఆదరించారు. నేను న్యూస్ ఛానెల్ లో ఉన్నప్పుడే ది డీల్ సినిమా అవకాశం వచ్చింది. గతంలో పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేశాను. ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్ నటించడం సంతోషంగా ఉంది అని తెలిపింది.
నటుడు రవి ప్రకాష్ మాట్లాడుతూ.. ది డీల్ సినిమా అక్టోబర్ 18న థియేటర్స్ లోకి వస్తోంది. హను నాకు ఈశ్వర్ సినిమా నుంచి పరిచయం. ఇప్పటికి 22 ఏళ్లుగా మా ఫ్రెండ్షిప్ కొనసాగుతుంది అని అన్నారు. మూవీ ప్రెజెంటర్ డా.అనితారావు మాట్లాడుతూ.. ఇది థ్రిల్లర్ సినిమా కాబట్టి ఆర్టిస్టులు, టెక్నిషియన్స్ తో షూటింగ్ కు ముందే బాగా డిస్కస్ చేసేవాళ్లం. హను గారికి హీరోగా, చందన, ధరణి కి హీరోయిన్స్ గా మంచి పేరొస్తుంది అని అన్నారు.
హీరో, దర్శకుడు హను కోట్ల మాట్లాడుతూ.. ఇవాళ గెస్టులుగా వచ్చిన బసి రెడ్డి గారికి, మిర్యాల రవీందర్ రెడ్డి గారికి ధన్యవాదాలు. హీరో, దర్శకుడు కావాలనేది నా కల. ఈ క్రమంలోనే ది డీల్ సినిమా తీసాను. ఈశ్వర్ సినిమాలో నటించాక మళ్లీ ఫ్రెండ్ క్యారెక్టర్స్ వచ్చాయి. కానీ హీరో కావాలనే నా కల కోసమే ప్రయత్నించాను. నాటకాలు, సీరియల్స్, రేడియో ప్రోగ్రామ్స్.. ఇలా చాలా చేసి ఇప్పుడు ది డీల్ సినిమాతో దర్శకుడిగా, నటుడిగా మీ ముందుకు వస్తున్నాను. ఇది మంచి థ్రిల్లర్ సినిమా. ఈ సినిమాకు పార్ట్ 2 కూడా ఉంటుంది అని తెలిపారు.
View this post on Instagram