Salaar : సలార్ ఫ్లెక్సీ కడుతూ.. కరెంట్ షాక్ తగిలి ప్రభాస్ అభిమాని మృతి..

సలార్ ఫ్లెక్సీ కడుతూ కరెంట్ షాక్ తగిలి ప్రభాస్ అభిమాని మృతి. ఎక్కడ జరిగిందంటే..

Prabhas fan is passed due to current shock in salaar celebrations

Salaar : ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన ‘సలార్’ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురు చూశారు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం మొదటి భాగం నేడు ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. దీంతో థియేటర్స్ వద్ద అభిమానుల సందడి కనిపిస్తుంది. ఈరోజు అర్ధరాత్రి నుంచే సెలబ్రేషన్స్ మొదలు కావడంతో థియేటర్స్ వద్ద కోలాహలంగా ఉంది. అయితే ఈ సందడి ఒక అపశృతి చోటు చేసుకుంది. రిలీజ్ సెలబ్రేషన్స్ లో ఉన్న ఒక అభిమాని కరెంట్ షాక్ తగిలి మృతి చెందిన ఘటన అందర్నీ బాధిస్తుంది.

Also read : Salaar Twitter Review : సలార్ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది..

శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని రంగ థియేటర్ లో సలార్ సినిమా ఫ్లెక్సీ కడుతుండగా ఈ ప్రమాదం జరిగింది. 29 ఏళ్ళ వయసు ఉన్న బాలరాజు.. థియేటర్ వద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తున్నాడు. ఆ సమయంలో ఫ్లెక్సీకి ఉన్న ఇనుప ఫ్రేమ్ కరెంట్ తీగలకు తగలడంతో విద్యుత్ షాక్ కి గురయ్యాడు. ప్రమాదంలో అతడు అక్కడిక్కడే మరణించినట్లు తెలుస్తుంది. ఇక ఈ ఘటన పై బాలరాజు కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరెంటు తీగలు తక్కువ ఎత్తులో ఉండడం వల్లే ప్రమాదం జరిగిందని ఆరోపిస్తున్నారు.

ఇక ఈ ఘటన తోటి ప్రభాస్ అభిమానులను బాధకి గురి చేస్తుంది. చాలా కాలంగా ప్రభాస్ నుంచి ఒక మాస్ బొమ్మ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు.. సలార్ చిత్రంతో అరిరిపోయే మాస్ ఎంటర్టైనర్ దొరికినట్లు చెబుతున్నారు. దీంతో థియేటర్స్ వద్ద రెబల్స్ తెగ సందడి చేస్తున్నారు. ఈ సంతోషంలో ఇలాంటి వార్త వినడం అభిమానులని దుఃఖానికి గురి చేస్తుంది.

ఇది ఇలా ఉంటే, ప్రభాస్ సొంత ఊరులో ఒక్క థియేటర్లో కూడా బెనిఫిట్ షో పడకపోవడం గమనార్హం. ప్రభాస్ సొంత ఊరు భీమవరంలో సినిమా టికెట్స్ ని అధిక రేట్లకు అమ్ముతున్నారంటూ గత రెండు రోజులుగా ఆందోళన జరుగుతుంది. ఈ విషయం గురించి అభిమానులు అధికారులకు ఫిర్యాదు చేయడంతో ప్రభుత్వ నిర్ణయించిన రేట్లకే టికెట్లు అమ్మాలని థియేటర్ యాజమాన్యాయానికి ఆర్డర్ పాస్ చేశారు. ఇక ఆ రగడ కారణంతో భీమవరంలో బెనిఫిట్ షోలు నోచుకొని పరిస్థితి వచ్చింది.