×
Ad

Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. హను సినిమా వస్తోంది.. దసరాకి సిద్ధమవ్వండి!

ప్రభాస్(Prabhas) 'ఫౌజీ' మూవీ రిలీజ్ డేట్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

prabhas fauzi movie releasing for 2026 dasara

  • ప్రభాస్ ‘ఫౌజీ’ రిలీజ్ డేట్ న్యూస్ వైరల్
  • దసరా బరిలో దించనున్న మేకర్స్
  • ఆగస్టు 15న ఫౌజీ టీజర్

Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రెజెంట్ లైనప్ చూస్తే మతి పోవడం ఖాయం. క్రేజ్ సినిమాలను, డైరెక్టర్ లను లైన్లో పెట్టాడు ఈ స్టార్. వాటిలో దర్శకుడు హను రాఘవపూడితో చేస్తున్న సినిమా ఒకటి. అదే ఫౌజీ. ఇండియన్ ఆర్మీ బ్యాక్డ్రాప్ లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు హను రాఘవపూడి. సీతా రామం లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తరువాత దర్శకుడు హను రాఘవపూడి నుంచి వస్తున్న సినిమా కావడంతో ఫౌజీ సినిమాపై అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి.

అందుకే ఈ సినిమా గురించి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయినా క్షణాల్లో వైరల్ అవుతోంది. ఇక ప్రభాస్(Prabhas) కెరీర్ లో ఫస్ట్ టైం ఆర్మీ మ్యాన్ గా కనిపిస్తుండటంతో ఈ సినిమా విడుదల కోసం ఆయన ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. కానీ, మేకర్స్ మాత్రం ఈ సినిమా విడుదలపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయడం లేదు. అయితే, తాజాగా ఇండస్ట్రీ నుంచి ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Samantha: పేరు మార్చుకున్న సమంత.. భర్త పేరు వచ్చేలా.. కొత్త పేరు ఏంటో తెలుసా?

అదేంటంటే, ప్రభాస్ హీరోగా వస్తున్న ‘ఫౌజీ’ సినిమాను 2026 దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నారట మేకర్స్. ఇప్పటికే ఫౌజీ సినిమా షూటింగ్ 80 శాతం కంప్లీట్ అయ్యిందట. మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఇప్పటికే మొదలుపెట్టారట మేకర్స్. ఇక గ్రాఫిక్స్ వర్క్ కూడా ఇప్పటికే మొదలవడంతో త్వరలోనే సినిమా పూర్తయ్యే అవకాశం ఉందట.

కాబట్టి, మేకర్స్ ముందుగా అనుకున్నట్టుగానే 2026 దసరాకి ప్రేక్షకుల ముందుకు ఈ సినిమాను తీసుకురావాలని పక్కా ప్లాన్ చేస్తున్నారట. నిజానికి ఈ విషయం గురించి జనవరి 26న ఒక అప్డేట్ వస్తుంది అని అనుకున్నారు అంతా కానీ రాలేదు. ఆగస్టు 15వ తేదీన టీజర్ తో పాటు రిలీజ్ డేట్ ను ప్రకటిస్తారని తెలుస్తోంది. ఇక ఈ న్యూస్ వైరల్ అవుతుండటంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.