Prabhas Grand Entry in San Diego Comic Con Event with new Look
Prabhas New Look : ప్రభాస్ (Prabhas) హీరోగా తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ మూవీ ప్రాజెక్ట్ K. వైజయంతి మూవీస్ బ్యానర్ పై దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే (Deepika Padukone), దిశా పఠాని, కమల్ హాసన్.. పలువురు స్టార్ కాస్ట్ నటిస్తున్నారు. ఇక ఈ సినిమా టైటిల్, ఫస్ట్ గ్లింప్స్ అమెరికా కాలిఫోర్నియాలోని San Diegoలో నిర్వహించే ప్రతిష్టాత్మక ఈవెంట్ కామిక్ కాన్ లో రిలీజ్ చేయబోతున్నట్టు ఆల్రెడీ ప్రకటించారు.
ఇప్పటికే ప్రభాస్, కమల్ హాసన్, చిత్రయూనిట్ అమెరికాకు చేరుకున్నారు. నిన్న సాయంత్రమే ప్రభాస్ ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేశారు. సూపర్ మ్యాన్ లుక్ లో ప్రభాస్ ఫస్ట్ లుక్ అదిరింది. ఇక అమెరికాలో కామిక్ కాన్ ఈవెంట్ మొదలైంది. ఈ ఈవెంట్ లో ప్రాజెక్ట్ K సినిమా ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టేసింది. ప్రాజెక్ట్ K రైడర్స్ తో ప్రమోషన్స్ చేయిస్తున్నారు చిత్రయూనిట్. ఇక కామిక్ కాన్ ఈవెంట్ కి ప్రభాస్ ఎంట్రీ ఇచ్చాడు.
సరికొత్త లుక్ లో జీన్స్, బ్లూ సూట్ వేసి అదరగొట్టాడు. ఈవెంట్ లో మీడియాకు పోజులు ఇచ్చాడు ప్రభాస్. ఇక ప్రభాస్ తో పాటు రానా కుడా ఈవెంట్ కి హాజరయ్యాడు. ఈ ఫోటోలు వైరల్ అవ్వడంతో కామిక్ కాన్ ఈవెంట్ లో ప్రభాస్ ఎంట్రీ అదిరింది, ప్రభాస్ కొత్త లుక్ బాగుంది అంటూ అభిమానులు, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.