Kalki 2898 AD : భారీ ధరకు అమ్ముడుపోయిన కల్కి ఓటీటీ రైట్స్..

ప్రభాస్ కల్కి మూవీ ఓటీటీ రైట్స్ వందల కోట్లకు అమ్ముడు పోయాయంట. కేవలం ఓటీటీ రైట్స్ ఈ రేంజ్ లో అమ్ముడుపోయాయంటే, థియేటర్స్ రైట్స్..

Kalki 2898 AD : ప్రభాస్ అభిమానులతో పాటు నేషనల్ వైడ్ ఆడియన్స్ అంతా ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న సినిమా ‘కల్కి 2898 AD’. ఇంటర్నేషనల్ లెవెల్ లో ఇండియన్ ఫ్యూచరిస్టిక్ మూవీగా నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం దాదాపు 600 కోట్ల బడ్జెట్ తో రూపొందుతుంది. వైజయంతి మూవీస్ బ్యానర్ పై సి అశ్వినీదత్ ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

హాలీవుడ్ చిత్రాల తరహాలో ఫ్యూచరిస్టిక్ మూవీగా ఈ సినిమా తెరకెక్కుతుండడంతో.. ఆడియన్స్ తో పాటు సినీ మేకర్స్ లో కూడా మంచి ఆసక్తి నెలకుంది. దీంతో ఈ మూవీ ధియేటరికల్, శాటిలైట్, ఓటీటీ రైట్స్ ని సొంతం చేసుకోవడం కోసం గట్టి డిమాండ్ కనిపిస్తుంది. ఇక ఈ డిమాండ్ తో మూవీ రైట్స్ భారీ ధర పలుకుతున్నట్లు సమాచారం. ఈక్రమంలోనే కల్కి ఓటీటీ రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Also read : Siddharth – Aditi Rao Hydari : సినిమా షూటింగ్ అని చెప్పి.. పెళ్లి చేసుకున్నారు.. సిద్ధార్థ్, అతిథి పెళ్లి ఎలా జరిగిందంటే..?

సౌత్ ఇండియన్ రైట్స్ అన్నీ కలిపి రూ.200 కోట్లకు అమ్ముడుపోయినట్లు సమాచారం. ఇక హిందీ బెల్ట్ రైట్స్ దాదాపు రూ.175 కోట్లకు అమ్ముడైనట్లు చెబుతున్నారు. మొత్తం మీద ఈ చిత్రం ఓటీటీ రైట్స్ రూ.375 కోట్లకు అమ్ముడుపోయినట్లు ఫైలిన్ వర్గాల్లో కామెంట్స్ వినిపిస్తున్నాయి. కేవలం ఓటీటీ రైట్స్ ఈ రేంజ్ లో అమ్ముడుపోయాయంటే.. థియేటర్స్ రైట్స్ ఇందుకు రేటింపుగా ఉంటాయని తెలుస్తుంది.

దీని బట్టి చూస్తుంటే.. ఈ చిత్రం ధియేటరికల్, శాటిలైట్, ఓటీటీ రైట్స్ తోనే 1000 కోట్ల మార్క్ ని దాటేసేలా కనిపిస్తుంది. కాగా ఈ చిత్రాన్ని మే 9న రిలీజ్ చేస్తామంటూ గతంలో ప్రకటించారు. కానీ ఇప్పుడు ఆ డేట్ లో ఎలక్షన్స్ ఉండడంతో పోస్టుపోన్ చేయడానికి సిద్దమయ్యారట. ఈ సినిమాని బాహుబలి రిలీజ్ డేట్ ని తీసుకు రావాలని ఆలోచిస్తున్నారట. జులై 10న బాహుబలి ఫస్ట్ పార్ట్ రిలీజయింది. ఈ డేట్ కి అటుఇటుగా కల్కి ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

ట్రెండింగ్ వార్తలు