Kalki : తెలుగు రాష్ట్రాల్లో కల్కి మేనియా.. థియేటర్స్ దగ్గర ప్రభాస్ ఫ్యాన్స్ సందడి

తెలుగు రాష్ట్రాల్లో ‘కల్కి’ మేనియా మొదలైంది. కల్కి థియేటర్స్ దగ్గర ప్రభాస్ ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు.

Kalki : తెలుగు రాష్ట్రాల్లో కల్కి మేనియా.. థియేటర్స్ దగ్గర ప్రభాస్ ఫ్యాన్స్ సందడి

Kalki 2898 AD Movie

Kalki 2898 AD Movie : తెలుగు రాష్ట్రాల్లో ‘కల్కి’ మేనియా మొదలైంది. ప్రపంచ వ్యాప్తంగా కల్కి 2898 ఏడీ సినిమా విడుదలైంది. దాదాపు 10వేలకుపైగా స్క్రీన్స్ లో సినిమా విడుదలైంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో హీరో ప్రభాస్ ఫ్యాన్స్ ఊగిపోతున్నారు. రెండు రాష్ట్రాల్లోని థియేటర్స్ వద్ద ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. ప్రభాస్ భారీ కటౌట్స్ ఏర్పాటు చేశారు.. బాణాసంచా పేల్చి సంబరాలు చేసుకుంటున్నారు. పలు చోట్ల బెనిఫిట్ షోలు నడుస్తున్నాయి. హైదరాబాద్ లోని హైమాక్స్ దగ్గర సందడి నెలకొంది. భారీ సంఖ్యలో ప్రభాస్ ఫ్యాన్స్ థియేటర్ వద్దకు చేరుకొని బాణాసంచా పేల్చి సందడి చేశారు.

Also Read : Kalki 2898AD : అమలాపురం నుంచి అమెరికా దాకా కల్కి ఫీవర్.. కల్కి సినిమా మొదలు నుంచి ఆసక్తికర విషయాలు ఇవే..

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ప్రభాస్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. కల్కి సినిమా బెనిఫిట్ షోకి ముందుగానే డీజేలతో అభిమానులు హోరెత్తించారు. జిల్లాలోని అన్ని థియేటర్లలో బెనిఫిట్ షోలు ప్రదర్శించారు. రోజుకి ఐదు షోలతోపాటు అదనంగా బెనిఫిట్ షో ప్రదర్శనకు కూడా ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ప్రభాస్ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెల్లవారు జామునే థియేటర్ల వద్దకు చేరి సంబరాలు చేసుకున్నారు. అదేవిధంగా విజయవాడలోని కల్కి సినిమా థియేటర్ల వద్ద సందడి వాతావరణం నెలకొంది. ప్రభాస్ ఫ్యాన్స్.. డప్పులతో సందడి చేశారు. ప్రభాస్ ఫొటోలకు పాలాభిషేకం చేశారు. తెలుగు రాష్ట్రాల్లోని కల్కి సినిమా ప్రదర్శించే అన్ని థియేటర్ల వద్ద కోలాహలం నెలకొంది. థియేటర్ల ఎదుట ప్రభాస్ పెద్దపెద్ద కటౌట్లు ఏర్పాటు చేసి ప్రభాస్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు.