Kalki 2898 AD : కల్కి టీజర్ వీడియో లీక్.. రిలీజ్ డేట్ వచ్చేసింది.. అదే రోజున విడుదల..

ప్రభాస్ కల్కి టీజర్ వీడియో లీక్ అయ్యింది. రిలీజ్ డేట్ ని అదే రోజున ఫిక్స్ చేశారు.

Prabhas Kalki 2898 AD movie released date teaser video leaked

Kalki 2898 AD : ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా హిందూ మైథలాజి కథతో తెరకెక్కుతున్న సినిమా ‘కల్కి 2898AD’. ఈ సినిమాలో కమల్‌ హాసన్‌, దీపికా పదుకొనే, దిశా పటాని, అమితాబ్ బచ్చన్ ముఖ్య పాత్రలు చేస్తున్నారు. కాగా ఈ సినిమా ఈ సంక్రాంతి పండక్కే రావాల్సింది. కానీ షూటింగ్, గ్రాఫిక్స్ వర్క్ ఆలస్యం అవ్వడంతో వాయిదా పడింది. ప్రస్తుతం షూటింగ్ చివరిదశలో ఉందని సమాచారం.

ఇక కొత్త రిలీజ్ డేట్ ని ఈ పండక్కి అనౌన్స్ చేస్తామంటూ మేకర్స్ ఓ టైమర్ కూడా ఫిక్స్ చేశారు. ఈ టైమర్ బట్టి ఆ రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ జనవరి 13న అంటే రేపు రాబోతుంది. ఇక ఈ ప్రటనతో పాటు టీజర్ ని కూడా ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతున్నట్లు సమాచారం. తాజాగా ఆ టీజర్ కి సంబంధించిన ఓ వీడియో నెట్టింట లీక్ అయ్యింది. ఆ వీడియోలో సినిమా రిలీజ్ డేట్ కూడా రివీల్ అయ్యిపోయింది.

Also read : Prashanth Varma : చిరంజీవి పై కామెంట్స్ చేస్తున్న వారికి.. గట్టి కౌంటర్ ఇచ్చిన ‘హనుమాన్’ డైరెక్టర్..

ఈ సినిమాని మే 9న రిలీజ్ చేయబోతున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. వైజయంతి మూవీస్ బ్యానర్ లో వచ్చిన జగదేక వీరుడు అతిలోక సుందరి, మహానటి, మహర్షి సినిమాలు మే 9న రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ ని అందుకున్నాయి. దీంతో ఇప్పుడు తమ సంస్థ 50 పురస్కారాలు పూర్తీ చేసుకున్న సందర్భంలో వస్తున్న కల్కి చిత్రాన్ని కూడా తమకి బాగా కలిసొచ్చిన మే 9న తీసుకువచ్చేందుకు సిద్ధమయ్యారు.

కాగా ఈ రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ తో రిలీజ్ చేయబోయే టీజర్.. దాదాపు 1 నిమిషం 23 సెకెన్ల నిడివితో ఉండబోతుందని సమాచారం. సూపర్ హీరోగా కాన్సెప్ట్ తో ఫ్యూచరిస్టిక్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రంలో వాడే టెక్నాలజీ, ఆయుధాలు, ట్రోప్స్, కాస్ట్యూమ్స్.. ఇలా ప్రతిదీ భవిష్యత్ లో ఎలా మార్పు చెందే అవకాశం ఉందనే అంశం పై మూవీ టీం.. ప్రత్యేక శ్రద్ద పెట్టి భారతీయ మూలాలతో ప్రతిదీ డిజైన్ చేశారట. టీజర్ తో ఆ ఊహా ప్రపంచాన్ని అందరికి పరిచయం చేయబోతున్నారు.