Prashanth Varma : చిరంజీవి పై కామెంట్స్ చేస్తున్న వారికి.. గట్టి కౌంటర్ ఇచ్చిన ‘హనుమాన్’ డైరెక్టర్..
చిరంజీవి పై కామెంట్స్ చేస్తున్న వారందరికీ ఒక్క ట్వీట్ తో గట్టి కౌంటర్ ఇచ్చిన 'హనుమాన్' డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.

Hanuman Director Prashanth Varma strong counter to who troll Chiranjeevi
Prashanth Varma : టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. ఒక్కో సినిమాతో తన స్థాయిని పెంచుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ‘అ’ సినిమాతో మొదలైన ప్రశాంత్ వర్మ జర్నీ.. కల్కి, జాంబి రెడ్డి సినిమాల సక్సెస్ తో ముందుకు సాగింది. ఇప్పుడు ‘హనుమాన్’ చిత్రంతో బ్లాక్ బస్టర్ ని అందుకున్నారు. నేడు జనవరి 12న ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ చిత్రం.. బ్లాక్ బస్టర్ టాక్ ని సొంతం చేసుకుంది.
కాగా ఈ మూవీ రిలీజ్ అవ్వడానికి చాలా సమస్యలే ఎదుర్కొంది. థియేటర్స్ దొరక్క, సపోర్ట్ లేక ఇబ్బందులు ఎదుర్కొంది. ఆ సమయంలో మెగాస్టార్ చిరంజీవి తన సపోర్ట్ ని తెలియజేస్తూ.. హనుమాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చారు. ఇక ఆ ఈవెంట్ లో చిరంజీవి మాట్లాడుతూ.. ప్రశాంత్ వర్మ పేరుని మర్చిపోయి ‘సురేష్ వర్మ’ అని పలికారు. అయితే అదే స్పీచ్ లో రెండోసారి మాత్రం ప్రశాంత్ వర్మ అంటూ కరెక్ట్ గానే పేరు పలికారు.
Also read : Hanuman Review : ‘హనుమాన్’ రివ్యూ.. జై హనుమాన్ అనాల్సిందే.. గూస్‌బంప్స్ గ్యారెంటీ..
కానీ చాలామంది చిరంజీవి మొదటి పలికిన ‘సురేష్ వర్మ’ పేరుని పట్టుకొని సోషల్ మీడియాలో ట్రోల్స్ వేస్తున్నారు. ఇక ఇవన్నీ ప్రశాంత్ వర్మ వరకు వెళ్లడంతో.. రియాక్ట్ అవుతూ ఓ కౌంటర్ ట్వీట్ వేశారు. “పేరులో ఏముంది. పిలిచిన వ్యక్తి పలుకులో ప్రేమ ఉన్నప్పుడు” అంటూ ట్రోల్స్ కి గట్టి సమాధానం చెప్పారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ ట్వీట్ పై మెగా ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పేరులో ఏముంది.. పిలిచిన వ్యక్తి పలుకులో ప్రేమ ఉన్నప్పుడు!@KChiruTweets sir ❤️
— Prasanth Varma (@PrasanthVarma) January 11, 2024
ఇక హనుమాన్ విషయానికి వస్తే.. గ్రాఫిక్స్ షాట్స్, VFX సీన్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అదిరిపోయాయి అంటున్నారు. ప్రశాంత్ వర్మ టేకింగ్ ఆడియన్స్ కి గూస్‌బంప్స్ తెప్పిస్తాయని చెబుతున్నారు. ముఖ్యంగా సినిమా చివర్లో వచ్చే ఆంజనేయస్వామి షాట్స్ అయితే ఆడియన్స్ ని సీట్ లో కూర్చోనివ్వవు అంటున్నారు. ఇక ఈ చిత్రానికి సీక్వెల్ ని కూడా ప్రకటించేశారు. అంతేకాదు బాహుబలిలో కట్టప్ప ట్విస్ట్‌లా.. ఈ చిత్రంలో హనుమంతుడు రాముడికి ఇచ్చిన మాట ఏంటనే ట్విస్ట్ పెట్టారు.