Kalki 2898 AD : కల్కి టీజర్ రివ్యూస్ పరిశీలిస్తున్న మూవీ టీం.. ఆదిపురుష్ దర్శకుడు ఓం రౌత్‌ని ట్రోల్..

ప్రభాస్ కల్కి టీజర్ పై వచ్చిన రివ్యూస్ ని చెక్ చేస్తున్న దర్శకుడు నాగ్ అశ్విన్. దీంతో ప్రభాస్ అభిమానులు..

Prabhas Kalki 2898 AD movie team checking reviews on teaser

Kalki 2898 AD : ప్రభాస్ (Prabhas) హీరోగా, కమల్ హాసన్ (Kamal Haasan) విలన్ గా తెరకెక్కుతున్న సూపర్ హీరో మూవీ కల్కి (Kalki 2898 AD). మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని వైజయంతి మూవీస్ బ్యానర్ దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కాగా ఇటీవల ఈ మూవీ నుంచి ప్రభాస్ ఫస్ట్ పోస్టర్ రిలీజ్ కాగా.. ఎడిటింగ్ పై అనేక విమర్శలు ఎదురుకుంది మూవీ టీం. దీంతో ఆ ఫస్ట్ లుక్ ని డిలీట్ చేసేసి.. తరువాత రోజు మరో పోస్ట్ వేశారు.

Yadamma Raju : ఇంకా యాక్సిడెంట్ నుంచి కోలుకొని యాదమ్మ రాజు.. హాస్పిటల్ లో సేవలు చేస్తున్న భార్య..

ఇక టైటిల్ అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన టీజర్.. ఆడియన్స్ కి పరవాలేదు అనిపించింది. తాజాగా ఈ టీజర్ VFX కి వచ్చిన రివ్యూస్ అన్నిటిని మూవీ టీం పరిశీలిస్తుంది. ఆ రివ్యూస్ అన్ని చెక్ చేసి మూవీ VFX ని మరింతగా మెరుగుపరిచేందుకు వర్క్ చేస్తుంది. ఈ రివ్యూస్ అన్నిటిని దర్శకుడు నాగ్ అశ్విన్ స్వయంగా పరిశీలిస్తున్నాడు. ఈ విషయాన్ని నిర్మాత ప్రియాంక దత్.. తన సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. ఇక ఈ పోస్ట్ చూసిన ప్రభాస్ అభిమానులు.. ఆదిపురుష్ దర్శకుడు ఓం రౌత్‌ని ట్రోల్ చేస్తున్నారు.

Bro Movie : అదరగోట్టిన ‘బ్రో’ కలెక్షన్స్.. రెండు రోజుల్లో 75 కోట్లు దాటేసిందిగా.. థియేటర్స్‌లో పవన్ సునామీ..

ఆదిపురుష్ మూవీ నుంచి టీజర్ రిలీజ్ అయ్యినప్పుడే గ్రాఫిక్స్ విషయంలో అనేక ట్రోల్స్ ఎదురైనా విషయం తెలిసిందే. ఆ VFX ని సరిదిద్దుకోవడానికి ఆరు నెలలు వెనక్కి వెళ్లి థియేటర్స్ లోకి వచ్చినా.. గ్రాఫిక్స్ లో మాత్రం పెద్ద మార్పు కనిపించలేదు. ఇక ఇప్పుడు కల్కి విషయంలో ఒక ఎదురుదెబ్బ తగలగానే.. మూవీ టీం సరిదిద్దుకోవడానికి రివ్యూస్ చెక్ చేస్తుంది. కానీ ఆదిపురుష్ విషయంలో ఓం రౌత్ ఇలా ఏమి చేయలేదు. దీంతో ప్రభాస్ అభిమానులు.. ఓం రౌత్ ని సోషల్ మీడియాలో పలు మీమ్స్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు.

Prabhas Kalki 2898 AD movie team checking reviews on teaser