Kalki 2898 AD : ప్రభాస్ ‘కల్కి’ కోసం సౌండ్ డిజైనర్స్ కావాలంట.. ఇంటి దగ్గర నుంచే వర్క్..

ప్రభాస్ 'కల్కి' కోసం సౌండ్ డిజైనర్స్ కావాలంటూ మూవీ టీం ప్రకటన. మరి మీకు సౌండ్ మిక్సింగ్ పై అవగాహన ఉంటే..

Prabhas Kalki 2898 AD movie team gave requirement call for sound designing

Kalki 2898 AD : ప్రభాస్ నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘కల్కి 2898AD’. నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం హిందూ మైథలాజి కథతో ఫ్యూచరిస్టిక్ బ్యాక్ డ్రాప్ తో సాగబోతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. దీంతో చిత్ర యూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ని వేగవంతం చేశారు. ఈక్రమంలోనే ఎడిటింగ్ అండ్ సౌండ్ మిక్సింగ్ ని మొదలు పెట్టబోతున్నారు.

సూపర్ హీరో సూట్స్, మోడరన్ టెక్నాలజీ ఆయుధాలు.. ఇలా ఒక ఫ్యూచరిస్టిక్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సౌండ్ డిజైన్ అన్నది చాలా ముఖ్యమైంది. ప్రతి చిన్న విషయాన్ని కూడా ఆడియన్స్ కి తెలియజేసేలా సౌండ్ మిక్సింగ్ అనేది జరగాలి. దీంతో మూవీ టీం కొత్త టాలెంట్ ఉన్నవారికి కోసం ఎదురు చూస్తుంది. కల్కి మూవీ టీంలో పని చేసేందుకు అవకాశం కల్పిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది.

Also read : Ram Charan : రామ్ చరణ్ బర్త్ డే నాటికి RC16 ఫస్ట్ లుక్? .. బుచ్చిబాబు ఇలా ఫిక్స్ చేసారా?

కల్కి మూవీకి సౌండ్ డిజైనర్స్ అండ్ ఎడిటింగ్ చేసేవారు కావాలంటూ ప్రకటించింది. ఫ్రీలాన్స్ ద్వారా ఇంటి దగ్గర నుంచే కల్కి టీంతో వర్క్ చేయొచ్చు. మరి మీకు సౌండ్ మిక్సింగ్ పై అవగాహన ఉంటే.. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. వెంటనే కల్కి మూవీ టీంని vymcrew@gmail.com ద్వారా కాంటాక్ట్ అవ్వండి. ఈ చిత్రానికి సంతోష్ నారాయణ సంగీతం అందిస్తున్నారు.

కాగా ఈ మూవీని మే 9న రిలీజ్ చేయబోతున్నట్లు మూవీ టీం ఇటీవల అధికారికంగా ప్రకటించింది. వైజయంతి మూవీస్ బ్యానర్ అశ్వనీదత్ నిర్మిస్తున్న ఈ సినిమాలో కమల్ హాసన్ విలన్ గా నటిస్తున్నారు. దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తే దిశా పటాని, అమితాబ్ బచ్చన్ ముఖ్య పాత్రలు చేస్తున్నారు. అలాగే విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ కూడా నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.