Kalki Trailer Update : ప్రభాస్ కల్కి ట్రైలర్ రిలీజ్ టైం ఎప్పుడంటే.. వైరల్ అవుతున్న కొత్త పోస్టర్..

తాజాగా కల్కి సినిమా ట్రైలర్ రిలీజ్ టైం అనౌన్స్ చేస్తూ ఓ పోస్టర్ ని రిలీజ్ చేసారు.

Prabhas Kalki 2898AD Movie Trailer

Kalki Trailer Update : ప్రభాస్ కల్కి సినిమా కోసం దేశవ్యాప్తంగా అభిమానులు, ప్రేక్షకులు ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, గ్లింప్స్, బుజ్జి వెహికల్, యానిమేషన్ సిరీస్ తో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. కల్కి సినిమా జూన్ 27న రిలీజ్ కానుంది. ఇక నేడు జూన్ 10న కల్కి సినిమా ట్రైలర్ రిలీజ్ చేస్తామని ముందే ప్రకటించారు.

Also Read : Ram – Mahesh Babu : మహేష్ బాబు దర్శకత్వంలో రామ్ పోతినేని సినిమా..

తాజాగా కల్కి సినిమా ట్రైలర్ రిలీజ్ టైం అనౌన్స్ చేస్తూ ఓ పోస్టర్ ని రిలీజ్ చేసారు. కల్కి సినిమా ట్రైలర్ ని నేడు రాత్రి 7 గంటలకు విడుదల చేయనున్నట్టు మూవీ యూనిట్ ప్రకటించారు. దీంతో ట్రైలర్ కోసం అంతా ఎదురు చూస్తున్నారు. ఇక కల్కి ట్రైలర్ రిలీజ్ పోస్టర్ లో ప్రభాస్ అందరితో పోరాడుతున్నట్టు ఉంది. దీంతో ఈ పోస్టర్ కూడా వైరల్ గా మారింది.

ఇక ఈ సినిమాని దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు. కమల్ హాసన్, అమితాబ్, దీపికా పదుకోన్, దిశా పటానితో పాటు మరింతమంది స్టార్స్ ఈ సినిమాలో నటిస్తున్నట్టు సమాచారం.