Ram – Mahesh Babu : మహేష్ బాబు దర్శకత్వంలో రామ్ పోతినేని సినిమా..
ఇటీవల అన్నీ మాస్ సినిమాలు చేస్తున్న రామ్ పోతినేని మళ్ళీ ఓ క్లాస్ సినిమా చేయాలనుంటున్నాడు.

Ram Pothineni new movie under Director Mahesh Babu Rumours goes Viral
Ram – Mahesh Babu : హీరో రామ్ పోతినేని ఇటీవల స్కంద సినిమాతో వచ్చి పర్వాలేదనిపించాడు. త్వరలో పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఇస్మార్ట్ శంకర్ రీమేక్ డబల్ ఇస్మార్ట్ తో రాబోతున్నాడు. ఇటీవల అన్నీ మాస్ సినిమాలు చేస్తున్న రామ్ పోతినేని మళ్ళీ ఓ క్లాస్ సినిమా చేయాలనుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే ఓ కొత్త సినిమా ఓకే చేసినట్టు సమాచారం.
నవీన్ పోలిశెట్టి, అనుష్క జంటగా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే సినిమాతో దర్శకుడు మహేష్ బాబు టాలీవుడ్ కి పరిచయమయ్యాడు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. డైరెక్టర్ మహేష్ బాబు తన మొదటి సినిమాతోనే హిట్ కొట్టాడు. ఇప్పుడు తన నెక్స్ట్ సినిమా రామ్ తో చేయబోతున్నట్టు టాలీవుడ్ లో వినిపిస్తుంది. ఆల్రెడీ కథ రామ్ కి వినిపించగా ఓకే చేసినట్టు, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఈ సినిమా ఉండబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
Also Read : Movie Shooting Updates : ఏ సినిమా షూటింగ్ ఎక్కడ జరుగుతుంది..? దేవర, విశ్వంభర, పుష్ప 2, గేమ్ ఛేంజర్ సంగతేంటి?
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో మెప్పించిన డైరెక్టర్ మహేష్ బాబు రామ్ పోతినేనితో ఎలాంటి సినిమా తీసుకొస్తాడో చూడాలి. త్వరలోనే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.