Prabhas Make Over For Sandeep Reddy Vanga Spirit Movie
డైరెక్టర్ సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో రాబోతున్న స్పిరిట్ మూవీపై ఓ రేంజ్‌లో అంచనాలు ఉన్నాయి. డార్లింగ్ ప్రభాస్ ఈ మూవీలో పోలీస్ ఆఫీసర్‌గా కనిపంచబోతుండటంతో.. ఈ సినిమా కోసం ఈగర్లీగా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. తన సినిమా కెరీర్‌లోనే ప్రభాస్ ఫస్ట్ టైమ్ పోలీస్ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నాడని అంటున్నారు. దాంతో స్పిరిట్ మూవీ విషయలో అటు డైరెక్టర్ సందీప్‌రెడ్డి వంగా..ఇటు ప్రభాస్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
స్పిరిట్ మూవీలో న్యూలుక్‌తో అట్రాక్ట్ చేయబోతున్నాడట. ప్రభాస్ తన బాడీని పూర్తిగా ట్రాన్స్‌ఫార్మ్ చేస్తున్నాడని ఫిల్మ్ సర్కిల్స్‌లో హాట్ టాక్. స్లిమ్ అండ్ ఫిట్ లుక్ కోసం ఇంటెన్స్ వర్కవుట్స్, స్ట్రిక్ట్ డైట్‌తో కసరత్తులు చేస్తున్నాడట. ఏకంగా ఎయిట్ ప్యాక్ బాడీని సొంతం చేసుకుంటున్నాడట.
సందీప్ రెడ్డి వంగా, ప్రభాస్‌కు స్పెషల్ ఫిట్‌నెస్ గైడ్‌లైన్స్ ఇచ్చినట్లు సమాచారం. ఈ సినిమాలో ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడని, అందుకే ఈ లుక్‌కి స్పెషల్ కేర్ తీసుకుంటున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. జిమ్‌లో గంటల తరబడి కష్టపడుతూ, ప్రొఫెషనల్ ట్రైనర్స్ సాయంతో తన ఫిజిక్‌ను పర్‌ఫెక్ట్‌గా మలుచుకుంటున్న ప్రభాస్, స్పిరిట్‌తో మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ కొత్త లుక్‌లో ప్రభాస్‌ను చూసేందుకు అభిమానులు ఇప్పటి నుంచే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..