Narne Nithiin : ఎట్టకేలకు రిలీజ్ అవుతున్న నార్నె నితిన్ మొదటి సినిమా.. ట్రైలర్ రిలీజ్.. సినిమా ఎప్పుడంటే..
ఎట్టకేలకు నార్నె నితిన్ సినిమా శ్రీ శ్రీ శ్రీ రాజావారు రిలీజ్ కి రెడీ అయింది.

Narne Nithiin Satish Vegesna Sri Sri Sri Raja Vaaru Movie Trailer Released
Narne Nithiin : ఎన్టీఆర్ బామ్మర్దిగా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన నార్నె నితిన్ మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్, ఆయ్.. సినిమాలతో వరుస హిట్స్ కొట్టాడు. అయితే నార్నె నితిన్ నటించిన మొదటి సినిమా శ్రీ శ్రీ శ్రీ రాజావారు మాత్రం పలుమార్లు వాయిదా పడింది. ఎట్టకేలకు నార్నె నితిన్ సినిమా శ్రీ శ్రీ శ్రీ రాజావారు రిలీజ్ కి రెడీ అయింది.
శతమానం భవతి ఫేమ్ డైరెక్టర్ సతీష్ వేగేశ్న దర్శకత్వంలో నార్నె నితిన్, సంపద జంటగా ‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు’ సినిమా తెరకెక్కింది. శ్రీ వేధాక్షర మూవీస్ బ్యానర్ పై చింతపల్లి రామారావు నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పుడు జూన్ 6న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించి ట్రైలర్ రిలీజ్ చేసారు.
Also Read : Chaurya Paatam : ఓటీటీలో దూసుకుపోతున్న సినిమా.. దొంగతనం కథతో సస్పెన్స్ థ్రిల్లర్..
శ్రీ శ్రీ శ్రీ రాజావారు ట్రైలర్ చూస్తుంటే.. సిగరెట్ లకు అలవాటైన హీరో అమ్మాయి కోసం, తండ్రి కోసం సిగరెట్ మానేయాల్సి వస్తే ఏం జరిగింది అని గోవారి బ్యాక్ డ్రాప్ లో ఫ్యామిలీ మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించినట్టు తెలుస్తుంది. శ్రీ శ్రీ శ్రీ రాజావారు ట్రైలర్ మీరు కూడా చూసేయండి..
ట్రైలర్ లంచ్ ఈవెంట్ లో డైరెక్టర్ సతీష్ వేగేశ్న మాట్లాడుతూ.. ఈ సినిమాలో నరేష్ గారు ఒక డైలాగ్ చెప్తారు. మనల్ని మనం జయించుకోవడమే సక్సెస్ అంటే. ఈ కాన్సెప్ట్ తోనే సినిమాను తీసాం. నా సినిమాల్లో ఎక్కువమంది ఆర్టిస్టులు ఉంటారు. కారణం మన కుటుంబాల్లో ఎక్కువమంది ఉన్నట్టే. మరుగున పడిన కొన్నింటిని చూపించాలనే నా మూవీస్ ద్వారా తాపత్రయ పడుతుంటాను అని తెలిపారు.
Also Read : Ghatikachalam : ‘ఘటికాచలం’ మూవీ రివ్యూ.. నిర్మాత SKN రిలీజ్ చేసిన హారర్ థ్రిల్లర్..
నిర్మాత చింతపల్లి రామారావు మాట్లాడుతూ.. పూర్తి కమర్షియల్ ఫార్మాట్ లో భారీ తారాగణంతో ఈ సినిమాని తెరకెక్కించారు దర్శకుడు సతీష్ వేగేశ్న. ఎన్టీఆర్ ఎంతో మెచ్చి ఈ కథను ఎంపిక చేశారు. ఆయన అంచనాల మేరకు ఎక్కడా రాజీపడకుండా ఈ సినిమాని తెరకెక్కించాం. జూన్ 6న నార్నె నితిన్ ఖాతాలో శ్రీ శ్రీ శ్రీ రాజావారు తో మరో హిట్ పడుతుంది అని తెలిపారు.
ఇక ఈ సినిమాలో రావు రమేష్, నరేష్, రఘు కుంచె, ప్రవీణ్, రచ్చ రవి, సరయు, రమ్య, ప్రియ మాచిరాజు, భద్రం, జబర్దస్త్ నాగి.. పలువురు కీలక పాత్రల్లో నటించారు.