Chaurya Paatam : ఓటీటీలో దూసుకుపోతున్న సినిమా.. దొంగతనం కథతో సస్పెన్స్ థ్రిల్లర్..

చౌర్య పాఠం సినిమా గత నెల ఏప్రిల్ 25న థియేటర్స్ లో రిలీజ్ అవ్వగా ఇటీవలే ఓటీటీలోకి వచ్చింది.

Chaurya Paatam : ఓటీటీలో దూసుకుపోతున్న సినిమా.. దొంగతనం కథతో సస్పెన్స్ థ్రిల్లర్..

Payal Radhakrishna ThrinadhaRao Nakkina chauryapatam Movie Streaming in OTT

Updated On : May 31, 2025 / 8:19 PM IST

Chaurya Paatam : ఇంద్రరామ్, పాయల్ రాధాకృష్ణ జంటగా తెరకెక్కిన సినిమా ‘చౌర్య పాఠం’. నక్కిన నెరేటివ్‌ బ్యానర్‌పై డైరెక్టర్‌ నక్కిన త్రినాథరావు నిర్మాతగా మారి ఈ సినిమా నిర్మించాడు. నిఖిల్‌ గొల్లమారి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కగా రాజీవ్ కనకాల, సలీం ఫేకు, సుప్రియ.. పలువురు కీలక పాత్రల్లో నటించారు. చౌర్య పాఠం సినిమా గత నెల ఏప్రిల్ 25న థియేటర్స్ లో రిలీజ్ అవ్వగా ఇటీవలే ఓటీటీలోకి వచ్చింది.

చౌర్య పాఠం సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇండియా వైడ్ ట్రెండింగ్ 7 లో ఈ సినిమా దూసుకెళ్తుంది. థియేటర్స్ లో మెప్పించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో కూడా మెప్పిస్తుంది. ఓ బ్యాంక్ దొంగతనం చుట్టూ కథ తిరుగుతూనే పలు ట్విస్ట్ లతో మరో కథతో సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కించారు చౌర్యపాఠం.

chauryapatam

చార్యపాఠం కథ విషయానికొస్తే.. వేదాంత్(ఇంద్ర రామ్) డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తూ డైరెక్టర్ అవ్వాలని ట్రై చేస్తూ ఉంటాడు. అయితే వేదాంత్ వల్లే అతను పనిచేసే సినిమాకు భారీ నష్టం రావడంతో ఇతన్ని ప్రొడ్యూసర్స్ బ్లాక్ లిస్ట్ లో పెడతారు. దీంతో వేదాంత్ డైరెక్టర్ అవ్వాలంటే తనే సొంతంగా నిర్మాతగా చేయాలి, డబ్బులు కావాలి అని ఓ ధనిక గ్రామంని టార్గెట్ చేసి ఆ గ్రామంలో బ్యాంక్ ని దొంగతనం చేయాలని ఫిక్స్ అవుతాడు. వేదాంత్, తన ఫ్రెండ్ లక్ష్మణ్(మ్యాడీ), సినిమాల్లో బ్లాస్ట్ లు చేసే బబ్లూ(సలీం ఫేకు), జాక్ అనే మరో వ్యక్తితో కలిసి ఆ ఊరిలో బ్యాంక్ దొంగతనానికి ప్లాన్ చేస్తారు.

Also Read : Akhil akkineni wedding : సీఎం రేవంత్ రెడ్డిని క‌లిసిన నాగార్జున దంప‌తులు.. అఖిల్ పెళ్లికి ఆహ్వానం..!

ఆ ఊళ్ళో సర్పంచ్ వసుధ(సుప్రియ) – ఆ ఊరి జమిందార్(రాజీవ్ కనకాల)ల మధ్య విబేధాలు ఉంటాయి. వేదాంత్ అతని టీమ్ అంతా ఓ స్కూల్ లో బస చేస్తూ ఆ స్కూల్ నుంచి బ్యాంక్ వరకు టన్నెల్ తవ్వుకుంటూ వెళ్లి డబ్బులు దొంగతనం చేద్దామని పని మొదలుపెడతారు. మధ్యలో ఓ ఇంటి బేస్మెంట్ అడ్డు వచ్చి అందులో అన్ని అస్థిపంజరాలు కనిపిస్తాయి. అసలు ఆ అస్థిపంజరాలు ఎవరివి? ఆ ఇల్లు ఎవరిది? వేదాంత్ అతని మనుషులు బ్యాంక్ దొంగతనం చేస్తారా? జమిందార్ కి – సర్పంచ్ కి ఎందుకు పడదు? వేదాంత్ డైరెక్టర్ అవుతాడా? మధ్యలో వేదాంత్ లవ్ స్టోరీ ఏంటి తెలియాలంటే ఈ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా చూడాల్సిందే.