×
Ad

Rajasaab Trailer : ప్రభాస్ ‘రాజాసాబ్’ ట్రైలర్ వచ్చేసింది.. హారర్ కామెడీతో అదరగొట్టేసారుగా..

మీరు కూడా ప్రభాస్ రాజాసాబ్ ట్రైలర్ చూసేయండి.. (Rajasaab Trailer)

Rajasaab Trailer

Rajasaab Trailer : ప్రభాస్ హీరోగా మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘రాజాసాబ్’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై విశ్వప్రసాద్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధి కుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మొదటిసారి ప్రభాస్ హారర్ కామెడీ చేస్తుండటంతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది.(Rajasaab Trailer)

ఇటీవల కొన్ని రోజుల క్రితం రాజాసాబ్ సినిమా టీజర్ రిలీజ్ చేసి అంచనాలు నెలకొల్పారు. తాజాగా రాజాసాబ్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమాని జనవరి 9న రిలీజ్ చేస్తున్నట్టు ట్రైలర్ తో అధికారికంగా ప్రకటించారు.

Also Read : Thamma Trailer : రష్మిక మందన్న బాలీవుడ్ సినిమా ట్రైలర్ వచ్చేసింది.. ‘థామా’ తెలుగు ట్రైలర్..

మీరు కూడా రాజాసాబ్ ట్రైలర్ చూసేయండి..

ట్రైలర్ లో.. ప్రభాస్ ఓ పాత బంగ్లాకు వెళ్లడం, అక్కడ దయ్యం రావడం, మధ్యలో కాస్త కామెడీ, హీరోయిన్స్ తో లవ్ చూపించగా చివర్లో దయ్యం ప్రభాస్ పాత్రని ఆవహించినట్టు చూపించారు. చివర్లో.. ఏందిరా మీ బాధ పుట్టలో చేయి పెడితే కుట్టడానికి నేనేమన్నా చీమనా.. రాక్షసుడిని అంటూ తాత గెటప్ లో డైలాగ్ చెప్పాడు ప్రభాస్. ట్రైలర్ తో సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. అయితే సినిమా రిలీజ్ కి ఇంకా మూడు నెలలు ఉండగానే ట్రైలర్ రిలీజ్ చేయడం ఏంటో, వచ్చే నెల ఎలాగో ప్రభాస్ పుట్టిన రోజు ఉంది కదా అని ఫ్యాన్స్ సందేహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది.

Also See : Akshara Gowda : సుధీర్ కొత్త సినిమా ఓపెనింగ్.. చీరకట్టులో మెరిసిన అక్షర గౌడ.. ఫొటోలు..