Prabhas Sisters : చెల్లెళ్ళతో ప్రభాస్ అల్లరి మాములుగా లేదుగా.. కల్కి సాంగ్ షూట్‌లో ప్రభాస్ చెల్లెళ్ళ హంగామా..

తాజాగా కల్కి సాంగ్స్ షూటింగ్ జరిగినప్పుడు ప్రభాస్ ముగ్గురు చెల్లెల్లు షూటింగ్ సెట్ కి వచ్చారు.

Prabhas Sisters : చెల్లెళ్ళతో ప్రభాస్ అల్లరి మాములుగా లేదుగా.. కల్కి సాంగ్ షూట్‌లో ప్రభాస్ చెల్లెళ్ళ హంగామా..

Prabhas Photos with his Sisters in Kalki Movie Song Shoot Photos goes Viral

Updated On : June 18, 2024 / 10:12 AM IST

Prabhas Sisters : ప్రభాస్ త్వరలో కల్కి సినిమాతో రాబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా కల్కి సినిమా నుంచి భైరవ యాంతం అనే ఓ సాంగ్ ని కూడా విడుదల చేశారు. ఈ పాట పంజాబీ స్టైల్ లో ఉండటంతో ప్రభాస్ కూడా పంజాబీ గెటప్ వేసి పాటలో అలరించాడు. ప్రస్తుతం ఈ పాట ట్రెండ్ అవుతుంది. అయితే ఈ పాట షూటింగ్ సమయంలో ప్రభాస్ తన చెల్లెళ్ళతో కలిసి చేసిన అల్లరి ఇప్పుడు వైరల్ అవుతుంది.

ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజుకి ముగ్గురు కూతుళ్లు అని తెలిసిందే. కృష్ణంరాజుకు ప్రసీద, ప్రగతితో పాటు ఇంకో కూతురు ఉంది. ప్రభాస్ కి ఈ చెల్లెల్లు అంటే చాలా ఇష్టం. గతంలో కృష్ణంరాజు పుట్టిన రోజు సెలబ్రేషన్స్ లో ప్రభాస్ తన ముగ్గురు చెల్లెలతో కలిసి కనపడ్డాడు. కృష్ణంరాజు మరణం తర్వాత ప్రసీద సినిమా నిర్మాణంలో ఉంది కాబట్టి అప్పుడప్పుడు కనపడినా మిగిలిన ఇద్దరు చెల్లెల్లు మాత్రం కనపడలేదు.

Also Read : Sonakshi Sinha : బాలీవుడ్ భామ పెళ్లి డేట్ ఫిక్స్.. బ్యాచిలర్ పార్టీ ఫోటోలు వైరల్..

తాజాగా కల్కి సాంగ్స్ షూటింగ్ జరిగినప్పుడు ప్రభాస్ ముగ్గురు చెల్లెల్లు షూటింగ్ సెట్ కి వచ్చారు. అక్కడ ప్రభాస్ తో కలిసి పంజాబీ స్టైల్ లో స్టెప్పులు వేస్తూ రీల్స్ చేశారు. అన్నయ్యతో ఫోటోలు దిగారు. ఈ పాట పాడిన దిల్జీత్ దోసంజ్, ప్రభాస్ తో కూడా కలిసి ఈ ముగ్గురు చెల్లెల్లు ఫోటోలు దిగారు. సాంగ్ రిలీజయ్యాక ఇప్పుడు ఆ ఫొటోలు, వీడియోలు ఇప్పుడు ప్రసీద తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ప్రభాస్ చెల్లెళ్ళతో కలిసి చేసిన వీడియోలు, దిగిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ అభిమానులు ఇలా ప్రభాస్ చెల్లెళ్ళతో కలిసి అల్లరి చేయడం చూసి సంతోషిస్తున్నారు.