Salaar Trailer : సలార్ రిలీజ్ ట్రైలర్ చూశారా..? బాబోయ్ యాక్షన్ అదిరిపోయిందిగా..

తాజాగా సలార్ నుంచి ఓ కొత్త ట్రైలర్ రిలీజ్ చేశారు. యాక్షన్ అదిరిపోయింది.

Prabhas Prashanth Neel Movie Salaar Part 1 Cease Fire Release Trailer Here

Salaar Release Trailer : ప్రశాంత్ నీల్(Prashanth Neel) దర్శకత్వంలో ప్రభాస్(Prabhas) హీరోగా రాబోతున్న సలార్ పార్ట్ 1 సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. డిసెంబర్ 22న గ్రాండ్ గా ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. అభిమానులు ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు ప్రమోషన్స్ చేయకపోవడంపై అభిమానులు మాత్రం నిరాశ చెందారు.

ఇప్పటికే సలార్ సినిమా నుంచి టీజర్, ట్రైలర్, ఓ సాంగ్ రిలీజ్ చేయగా రిలీజ్ ట్రైలర్ రిలీజ్ చేస్తారని ప్రకటించారు. ఇవాళ ఉదయం రిలీజ్ చేస్తామని చిత్రయూనిట్ ప్రకటించి మళ్ళీ మధ్యాహ్నానికి వాయిదా వేయగా అభిమానులు ఫైర్ అవుతున్నారు. మొత్తానికి ప్రభాస్ సలార్ రిలీజ్ ట్రైలర్ ఇప్పుడు రిలీజ్ చేశారు.

ఈ కొత్త ట్రైలర్ ని పూర్తి యాక్షన్ కట్ తో రిలీజ్ చేశారు. ఒక సాధారణ మెకానిక్ అయిన దేవ (ప్రభాస్) తన స్నేహితుడు కోసం ఒక రాజయంలోకి పనోడిగా చొరబడి అక్కడ ఒక విధ్వంసమే సృష్టించాడు. ఇక మొదటి ట్రైలర్ లో శృతిహాసన్ చూపించిన మేకర్స్.. ఈ ట్రైలర్ లో చూపించారు. మందు ఉందా అంటూ ఒకేఒక డైలాగ్ తో ట్రైలర్ లో మెరిసింది. ట్రైలర్ అయితే అదిరిపోయింది.

Also read : Salaar : సలార్ ట్రైలర్ రిలీజ్ చేయడం లేదని.. ప్రశాంత్ నీల్ భార్య ఆగ్రహం.. పోస్ట్ వైరల్

ఇది ఇలా ఉంటే, ట్రైలర్ ని చెప్పిన టైంకి రిలీజ్ చేయడం లేదని అభిమానులు మాత్రమే కాదు, ప్రశాంత్ నీల్ భార్య కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రశాంత్ వైఫ్ నికితారెడ్డి ఆమె ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో.. ప్రశాంత్ నీల్ అంటూ కోపంతో ఉన్న ఎమోజిస్ పెట్టి షేర్ చేశారు. అభిమానులతో పాటు ప్రశాంత్ నీల్ వైఫ్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తుండడంతో.. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్ గా మారింది. అయితే ఇప్పుడు ఈ ట్రైలర్ చూసిన తరువాత ఆమె, అభిమానులు కూల్ అవుతారనే అనిపిస్తుంది.