Salaar : సలార్ ట్రైలర్ రిలీజ్ చేయడం లేదని.. ప్రశాంత్ నీల్ భార్య ఆగ్రహం.. పోస్ట్ వైరల్
సలార్ ట్రైలర్ రిలీజ్ విషయంలో అభిమానులు మాత్రమే కాదు, ప్రశాంత్ నీల్ భార్య కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రశాంత్ వైడ్ నికితారెడ్డి ఆమె ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో..

Prashanth Neel wife anger on prabhas Salaar trailer release issues
Salaar : ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్దమైన సినిమా ‘సలార్’. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మొదటి భాగం ‘సీజ్ ఫైర్’ ఈ నెల 22న రిలీజ్ కి సిద్దమవుతుంది. ఆల్రెడీ ఈ మూవీ నుంచి ఒక ట్రైలర్ ని రిలీజ్ చేశారు. సినిమా విడుదలకు ముందు మరో ట్రైలర్ ని కూడా రిలీజ్ చేస్తామంటూ ప్రకటించిన మూవీ టీం.. నిన్ననే ఆ ట్రైలర్ ని రిలీజ్ చేయాల్సి ఉంది. కానీ టెక్నికల్ సమస్య వలన ఈరోజు ఉదయం 10 గంటలకు పోస్టుపోన్ చేశారు.
కానీ ఆ టైం కూడా రిలీజ్ చేయలేదు. మధ్యాహ్నం 2 గంటలకి అని చెప్పారు. అయితే ఆ టైం కూడా రిలీజ్ చేయలేకపోయారు. దీంతో ప్రభాస్ అభిమానులు మూవీ టీం ఫుల్ ఫైర్ అవుతున్నారు. అభిమానులు మాత్రమే కాదు, ప్రశాంత్ నీల్ భార్య కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రశాంత్ వైఫ్ నికితారెడ్డి ఆమె ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో.. ప్రశాంత్ నీల్ అంటూ కోపంతో ఉన్న ఎమోజిస్ పెట్టి షేర్ చేశారు. అభిమానులతో పాటు ప్రశాంత్ నీల్ వైఫ్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తుండడంతో.. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్ గా మారింది.
Also read : Pallavi Prashanth : పల్లవి ప్రశాంత్, అతని ఫ్యాన్స్ పై పోలీస్ కేసు నమోదు..
ఇక ప్రతిసారి ఇలాగే చేస్తుంటే అభిమానుల్లో సినిమా రిలీజ్ పై కూడా సందేహం కలుగుతుంది. నిజానికి ఈ చిత్రం సెప్టెంబర్ లోనే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ అప్పుడు పోస్టుపోన్ చేసి ఇప్పటికి తీసుకు వచ్చారు. ఆ విడుదల వాయిదా విషయాన్ని కూడా చివరి వరకు చెప్పలేదు. మరో వారం రోజుల్లో రిలీజ్ అనగా పోస్టుపోన్ విషయం చెప్పారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ ని కూడా ఆశించిన స్థాయిలో చేయడం లేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లేవు, ఇంటర్వ్యూలు లేవు, సాంగ్స్, ట్రైలర్ ప్రమోషన్స్ కూడా సరిగ్గా లేవు. దీంతో అసలు రిలీజ్ అవుతుందా లేదా అని డౌట్ వస్తుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.