Pallavi Prashanth : పల్లవి ప్రశాంత్, అతని ఫ్యాన్స్ పై పోలీస్ కేసు నమోదు..

ప్రభుత్వ, ప్రైవేటు ఆస్థులను నాశనం చేయడం, కంటెస్టెంట్స్ పై దాడికి పాల్పడిన పల్లవి ప్రశాంత్, అతని ఫ్యాన్స్ పై పోలీస్ కేసు నమోదు అయ్యింది.

Pallavi Prashanth : పల్లవి ప్రశాంత్, అతని ఫ్యాన్స్ పై పోలీస్ కేసు నమోదు..

Police case filled on BiggBoss seven winner Pallavi Prashanth and his fans

Updated On : December 18, 2023 / 9:15 PM IST

Pallavi Prashanth : బిగ్‌బాస్ సీజన్ 7 టైటిల్ ని రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ సొంతం చేసుకున్నాడు. ఇక నిన్న ఈ సీజన్ ఫైనల్ ఎపిసోడ్ జరుగుతుండడంతో.. బిగ్‌బాస్ సెట్ ఉన్న హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియో వద్దకి అతని అభిమానులు చేసుకొని సందడి చేశారు. అయితే తన అభిమాని కంటెస్టెంట్ గెలిచాడనే ఆనందంలో పల్లవి ప్రశాంత్ అభిమానులు అత్యుత్సహం ప్రదర్శించారు. ఈక్రమంలోనే ఇతర కంటెస్టెంట్స్ అయిన అమర్ దీప్, అశ్విని శ్రీ, గీతూ రాయల్ కారుల పై దాడికి పాల్పడి అల్లరి చేశారు.

ఈ దాడిలో కంటెస్టెంట్స్ కార్లు ద్వంసం అవ్వడమే కాకుండా పలువురికి గాయాలు అయ్యినట్లు కూడా చెబుతున్నారు. అలాగే ప్రభుత్వ వాహనాలను కూడా ధ్వంసం చేశారట. ఇక పల్లవి ప్రశాంత్ అభిమానులు చేసిన పని పై పలువురు ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. రాజకీయ నాయకులు కూడా ఈ చర్యని ఖండిస్తూ వస్తున్నారు. ఇక ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న హైదరాబాద్ పోలీసులు.. పల్లవి ప్రశాంత్, ఘటనకి పాల్పడిన అతని అభిమానులపై కేసు నమోదు చేశారు.

Also read : Naga Vamsi : గుంటూరు కారంపై వచ్చే వార్తలన్నీ ఫేక్.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత..

నిన్న రాత్రి జరిగిన ఈ దాడిలో మొత్తం మీద ఆరు బస్సులు, ఓ పోలీస్‌ వాహనం, రెండు ప్రైవేటు వాహనాలు ద్వంసం అయ్యాయట. సీసీఫుటేజీ వీడియోలో లభించిన ఆధారాలతో ప్రభుత్వ, ప్రైవేటు వాహనాలు ధ్వంసం చేసిన అభిమానులపై జూబ్లీహిల్స్‌ పోలీస్ స్టేషన్ లో ఐపిసి 147, 148, 290, 353, 427రెడ్ విత్, 149 సెక్షన్ల కింద కేసుని నమోదు చేశారు. దాడులకు పాల్పడ్డ వారందర్ని వెంటనే అరెస్ట్ చేయనున్నారు. ఇక ఈ విషయంతో బిగ్‌బాస్ షో పై వ్యతిరేకత వస్తుంది. గత సీజన్స్ లో కూడా ఇలాంటి కొన్ని అల్లర్లు జరిగాయి. కానీ అవేవి దాడి చేసేంత, ప్రభుత్వ ఆస్థులు కూడా నాశనం చేసేంత పిచ్చితనానికి దారి తియ్యలేదు. కానీ రానురాను ఈ పిచ్చితనం మరింత పెరుగుతూ వస్తుంది.