Project K : అమెరికా ఈవెంట్‌లో ప్రాజెక్ట్ K సందడి చూశారా..? నెట్టింట వీడియో వైరల్..
అమెరికా కామిక్ కాన్ ఈవెంట్ లో ప్రాజెక్ట్ K గ్లింప్స్ రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. ఆ ఈవెంట్ లో చిత్ర యూనిట్ తెగ సందడి చేస్తుంది. అందుకు సంబంధించిన వీడియోలు..

Prabhas Project K at San Diego Comic Con event video and photos
Project K : ప్రభాస్ (Prabhas) హీరోగా తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ K టైటిల్ గ్లింప్స్ ని అమెరికా కాలిఫోర్నియాలోని San Diegoలో నిర్వహించే ప్రతిష్టాత్మక ఈవెంట్ కామిక్ కాన్ లో రిలీజ్ చేయబోతున్న సంగతి తెలిసిందే. దీంతో దర్శక నిర్మాతలతో పాటు ప్రభాస్ అండ్ కమల్ హాసన్ (Kamal Haasan) కూడా అక్కడికి చేరుకున్నారు. అయితే ఆ గ్లింప్స్ ని రిలీజ్ చేయడానికి కంటే ముందే.. మూవీలోని హీరోహీరోయిన్స్ ఫస్ట్ లుక్స్ రిలీజ్ చేసి ఆడియన్స్ ని సర్‌ప్రైజ్ చేశారు. అంతేకాదు అమెరికా ఈవెంట్లో జరుగుతున్న ప్రస్తుం విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులతో పంచుకుంటుంది.
దీంతో సోషల్ మీడియా మొత్తం ప్రాజెక్ట్ K సందడి కనిపిస్తుంది. కాగా ఈ సినిమాలోని రైడర్స్ పాత్రలని చిత్ర యూనిట్ ఇప్పటికే మనందరికీ పరిచయం చేసింది. ఇప్పుడు వారితోనే అక్కడ ప్రమోషన్స్ చేస్తున్నారు మేకర్స్. రైడర్స్ సూట్ వేసుకున్న వ్యక్తులు కామిక్ కాన్ ఈవెంట్ లోని గెస్ట్ లను భయపెడుతూ ఆకర్షిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా అక్కడి వీడియో ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తుంది. ఆ వీడియోలో ఈ సినిమా దర్శకుడు నాగ్ అశ్విన్ నడుచుకుంటూ వస్తుంటే.. ఒక్కసారిగా రైడర్స్ తన పై ఎటాక్ చేస్తారు.
ఇక ఈ వీడియోని మన సోషల్ మీడియా మీమర్స్ రకరకాల మీమ్స్ చేస్తూ నెట్టింట పోస్ట్ చేస్తున్నారు. కాగా ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్ ని అమెరికన్ టైం ప్రకారం ఈరోజు రాత్రి 1-2 గంటల సమయంలో ఈ గ్లింప్స్ రిలీజ్ కానుంది. ఇండియన్ టైం ప్రకారం రేపు జులై 21 తెల్లవారుజామున 1:30 నుండి 2:30 మధ్యలో ఈ గ్లింప్స్ విడుదల అవుతుంది. కాగా ఈ సినిమాని సూపర్ హీరో కాన్సెప్ట్ కి ఇండియన్ మైథాలజీ టచ్ ఇస్తూ తెరకెక్కుస్తున్నారు. కలియుగం చివరిలో ఈ సినిమా స్టోరీ మొదలు కాబోతుంది.
View this post on Instagram