Radha Krishna
Radha Krishna : గోపీచంద్ జిల్ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు రాధాకృష్ణ కుమార్. తర్వాత చాలా గ్యాప్ తీసుకొని ఏకంగా ప్రభాస్ తో రాధేశ్యామ్ సినిమా తెరకెక్కించాడు. మంచి ప్రయత్నమే చేసినా ఈ సినిమా కమర్షియల్ గా వర్కౌట్ అవ్వలేదు. ఈ సినిమా వచ్చి మూడేళ్లు దాటింది.(Radha Krishna)
ఇటీవల దర్శకుడు రాధాకృష్ణ తల్లి మరణించింది. ఈ విషయాన్ని కొద్దీ సేపటి క్రితమే రాధాకృష్ణ తన సోషల్ మీడియాలో తెలిపాడు. తల్లి ఫోటోని షేర్ చేస్తూ.. ఈ యూనివర్స్ లో నాకు స్థానం ఇచ్చి నా హృదయంలో చోటు కల్పించడం వరకు నీతో జీవితం ఒక సెలబ్రేషన్ అమ్మ. నా ఫస్ట్ లవ్ ని నేను ఎప్పుడూ మిస్ అవుతాను అని తెలిపాడు.
Also Read : Bellamkonda Sreenivas : మహేష్ బాబు కంటే ముందే బెల్లం బాబు.. ఆ హీరోలు కూడా..
రాధాకృష్ణ తల్లి రమణి ఇటీవల నవంబర్ 15 న మరణించారు. రాధా నేడు తన తల్లి మరణం గురించి, ఆమెని గుర్తు చేసుకుంటూ పోస్ట్ చేయడంతో ఈ విషయం తెలిసింది. దీంతో పలువురు రాధాకు సంతాపం ప్రకటిస్తున్నారు.
రాధేశ్యామ్ తర్వాత రాధాకృష్ణ ఇంకే సినిమాని ప్రకటించలేదు. పలు రూమర్స్ వచ్చిన అధికారికంగా రాధాకృష్ణ ఏ సినిమాని అనౌన్స్ చేయట్లేదు. ఆ సినిమా హిట్ అయి ఉంటే స్టార్ డైరెక్టర్ అయ్యేవాడు. ఇప్పుడు చేతిలో సినిమాలు లేవు, మరోవైపు తల్లి మరణంతో రాధాకృష్ణ తీవ్ర విషాదంలో ఉన్నారు.