Baahubali : టాలీవుడ్ చరిత్రని మార్చేసిన సినిమా రీ రిలీజ్.. ఎప్పుడో తెలుసా?

టాలీవుడ్ గురించి చెప్పాలంటే బాహుబలి ముందు బాహుబలి తర్వాత అని చెప్పాల్సిందే.

Prabhas Rajamouli Bahubali The Beginning Movie Re Releasing

Baahubali : టాలీవుడ్ గురించి చెప్పాలంటే బాహుబలి ముందు బాహుబలి తర్వాత అని చెప్పాల్సిందే. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్.. పలువురు కీలక పాత్రల్లో తెరకెక్కిన బాహుబలి సినిమా 2015 లో రిలీజ్ అయి భారీ విజయం సాధించి ఒక సరికొత్త చరిత్ర సృష్టించింది.

బాహుబలి సినిమా రిలీజయి.. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అని బాహుబలి 2 పై ఆసక్తి కలిగించేలా చేసారు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హవా మొదలైంది. సౌత్ సినిమాలు బాలీవుడ్ ని ఏలడం మొదలు పెట్టాయి. ఎవరూ ఊహించని ఓ మాహిష్మతి అనే రాజ్యాన్ని సృష్టించి రాజమౌళి ప్రేక్షకులకు ఓ అద్భుతాన్ని చూపెట్టారు.

Also Read : Rajamouli : ఆ లెక్కన రాజమౌళి నెక్స్ట్ సినిమా అదే.. మహేష్ బాబు సినిమా తర్వాత..

అలాంటి గొప్ప సినిమా వచ్చి పదేళ్లు అవుతున్న సందర్భంగా బాహుబలి సినిమాని రీ రిలీజ్ చేస్తామని మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. 2015 జులై 10న బాహుబలి పార్ట్ 1 రిలీజయింది. అయితే రీ రిలీజ్ మాత్రం అక్టోబర్ లో చేస్తామని మూవీ యూనిట్ ప్రకటించింది. డేట్ మాత్రం ప్రకటిచలేదు.

అక్టోబర్ 23 ప్రభాస్ పుట్టిన రోజు ఉండటంతో ఆ రోజు ఫ్యాన్స్ కోసం సినిమాని రీ రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. ప్రభాస్ ని పాన్ ఇండియా స్టార్ చేసిన బాహుబలి సినిమాని రీ రిలీజ్ చేస్తామని ప్రకటించడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి రీ రిలీజ్ లో ఎన్ని రికార్డులు కొడుతుందో చూడాలి.

Also Read : Rithu Chowdary : 700 కోట్ల స్కామ్ పై ‘రీతూ చౌదరి’ కామెంట్స్.. YS జగన్ పేరుని ప్రస్తావిస్తూ..