Salaar Censor : స‌లార్ సెన్సార్ పూర్తి..! ర‌న్ టైం ఎంతో తెలుసా..?

Salaar Movie Censor : యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తున్న చిత్రం స‌లార్‌. ప్రశాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమా రెండు భాగాలుగా రానున్న సంగ‌తి తెలిసిందే.

Salaar Censor

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తున్న చిత్రం స‌లార్‌. ప్రశాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమా రెండు భాగాలుగా రానున్న సంగ‌తి తెలిసిందే. మొదటి పార్ట్ సీజ్ ఫైర్ డిసెంబర్ 22న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ క్ర‌మంలో చిత్ర‌బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది. డిసెంబ‌ర్ 1న ఈ చిత్ర ట్రైల‌ర్ ను విడుద‌ల చేయ‌గా.. మంచి స్పంద‌న వ‌చ్చింది. అన్ని భాష‌ల్లో క‌లిపి 150 మిలియ‌న్లకి పైగా వ్యూస్ వ‌చ్చాయి. ప్ర‌స్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా అవుతోంది.

తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి అయిన‌ట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సెన్సార్ బృందం ‘ఏ’ స‌ర్టిఫికెట్‌ ఇచ్చిన‌ట్లు టాక్. ఈ సినిమాలో యాక్ష‌న్ సీన్స్‌తో పాటు వ‌యోలెన్స్ కాస్త ఎక్కువ‌గా ఉండ‌డంతో ‘ఏ’ స‌ర్టిఫికెట్ ఇచ్చార‌ట‌. ఇక మూవీ ర‌న్‌టైమ్ విష‌యానికి వ‌స్తే 2 గంట‌ల 55 నిమిషాల 22 సెక‌న్లు అని తెలుస్తోంది. అదే స‌మ‌యంలో మూవీ మొద‌లైన అర‌గంట త‌రువాత ప్ర‌భాస్ ఎంట్రీ ఉంటుంద‌నే టాక్ వినిపిస్తోంది.

Bigg Boss 7 Telugu : ఈ వీక్ హౌస్ నుంచి ఎలిమినేట్ కానుంది ఎవ‌రో తెలుసా..?

ఇదిలా ఉంటే.. చిత్ర బృందం రెండో ట్రైల‌ర్ విడుద‌ల చేసే ఆలోచ‌న‌లో ఉంద‌ట‌. ఆ ట్రైల‌ర్ మొత్తం ప్ర‌భాసే ఉంటాడ‌ని అంటున్నారు. రెండో ట్రైల‌ర్‌ను డిసెంబ‌ర్ 16న లేదా 18న విడుద‌ల చేసే అవ‌కాశాలు ఉన్నాయ‌ని అంటున్నారు. మలయాళం స్టార్ హీరో పృథ్వి రాజ్ సుకుమారన్, జగపతి బాబు విలన్ రోల్స్ చేస్తుండగా శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.

ట్రెండింగ్ వార్తలు