Bigg Boss 7 Telugu : ఈ వీక్ హౌస్ నుంచి ఎలిమినేట్ కానుంది ఎవ‌రో తెలుసా..?

Bigg Boss Telugu 7 Elimination : బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 7 చివ‌రి ద‌శ‌కు చేరుకుంది.

Bigg Boss 7 Telugu : ఈ వీక్ హౌస్ నుంచి ఎలిమినేట్ కానుంది ఎవ‌రో తెలుసా..?

Bigg Boss Telugu 7 Elimination

బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 7 చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. మ‌రికొద్ది రోజుల్లో గ్రాండ్ ఫినాలే జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టికే అంబ‌టి అర్జున్ ఫైన‌ల్‌కు చేరుకున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం 14వ వారం పూర్తికావొస్తుంది. ఈ వారం నామినేష‌న్స్‌లో అర్జున్ త‌ప్ప మిగిలిన ఆరుగురు అమర్ దీప్‌, ప్రశాంత్, శివాజీ, యావర్, శోభాశెట్టి, ప్రియాంక లు ఉన్నారు. వీరిలో ఈ వారం ఎవ‌రు ఎలిమినేట్ అవుతారోన‌ని అంద‌రూ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే.. ఈ వారం బిగ్‌బాస్ ముద్దు బిడ్డ ఎలిమినేట్ కానున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

ప్ర‌తిసారీలా కాకుండా ఈ వారం ఎలిమినేష‌న్ కోసం కాకుండా టైటిల్ విన్న‌ర్ కోసం ఓటింగ్ పోల్స్ ను నిర్వ‌హిస్తున్నారు. ఇందులో ఎవ‌రికి త‌క్కువ ఓట్లు వ‌స్తే వారు ఎలిమినేట్ కానున్నార‌ని అంటున్నారు. ఇక ఈ వారం నిర్వ‌హించిన టాస్క్‌ల కార‌ణంగా ఓటింగ్ శాతం మారుతూ వ‌స్తోంది. అయితే.. రైతుబిడ్డ ప‌ల్ల‌వి ప్ర‌శాంత్‌, అమ‌ర్ దీప్ ల‌కు అత్య‌ధిక శాతం ఓట్లు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. వీరిద్ద‌రి త‌రువాత శివాజీ ఉన్నాడ‌ని అంటున్నారు. ఇక డేంజ‌ర్ జోన్‌లో ప్రియాంక, శోభాశెట్టిలు ఉన్నట్లుగా టాక్‌.

Ram Charan : బాలీవుడ్ ఖాతాలో రామ్ చరణ్‌కి ఇంటెర్నేషనల్ అవార్డు

ఇక ఈ వారం శోభాశెట్టి ఎలిమినేట్ అయిన‌ట్లు లీకులు వ‌స్తున్నాయి. వాస్త‌వానికి శోభాశెట్టి చాలా స్ట్రాంగ్ ప్లేయ‌ర్‌. అన్ని టాస్కుల్లోనూ త‌న బెస్ట్ ఇస్తూ వ‌స్తోంది. హౌస్‌లో మాస్కు లేకుండా గేమ్ ఆడుతూ వ‌స్తోంది. మిగిలిన వారిలా కాకుండా నిజ‌మైన ఎమోషన్స్ ని చూపించింది. అయితే కొన్ని సందర్భాల్లో ఆమె ప్ర‌వ‌ర్త‌న ఆడియన్స్‌కు చిరాకు, విసుగు తెప్పిస్తున్నాయి. ఈ క్ర‌మంలో ఈ వారం ఆమెకు ఓట్లు త‌క్కువ‌గా ప‌డ్డాయ‌ని అంటున్నారు. చూడాలి మ‌రీ లీకు వీరులు చెబుతున్న‌ట్లు నిజంగానే శోభాశెట్టి ఎలిమినేట్ అయ్యిందా లేదా తెలియాలంటే ఆదివారం నాటి ఎపిసోడ్‌ వ‌ర‌కు వెయిట్ చేయ‌క‌త‌ప్ప‌దు.