Salaar : సలార్ కలెక్షన్స్ సునామీ.. ఇండియా వైడ్ ఫస్ట్ డే ఓపెనింగ్స్ రికార్డు..

సలార్ సినిమా ప్రభాస్ స్టామినా ఏంటో మరోసారి బాలీవుడ్ కి చూపించింది. ఇండియా వైడ్ ఫస్ట్ డే ఓపెనింగ్స్‌తో..

Prabhas Salaar Part 1 Cease Fire

Salaar Collections: సలార్ కోసం ప్రభాస్ అభిమానులు ఎదురు చూసిన చూపులకు తెరపడింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ చిత్రం మొదటి భాగం.. నిన్న పాన్ ఇండియా వైడ్ గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ప్రభాస్ నుంచి చాలా కాలం తరువాత ఒక మాస్ బొమ్మ రావడం, దానికి ప్రశాంత్ నీల్ దర్శకుడు కావడంతో మూవీ పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. దీంతో మొదటిరోజు సినిమా చూసేందుకు ఆడియన్స్ థియేటర్స్ వద్ద క్యూ కట్టారు. ఈ అంచనాలు మూవీ భారీ ఓపెనింగ్స్ అందుకునేలా చేసింది.

ఈ ఏడాది బాలీవుడ్ నుంచి వచ్చిన షారుఖ్ ఖాన్, రణబీర్ కపూర్ సినిమాలు ఇండియా వైడ్ భారీ ఓపెనింగ్స్ సాధించాయి. పఠాన్ 57 కోట్ల గ్రాస్, జవాన్ 75 కోట్ల గ్రాస్, యానిమల్ 63 కోట్ల గ్రాస్ ని అందుకున్నాయి. అయితే సలార్ ఈ మూడు చిత్రాలు కంటే ఎక్కువ గ్రాస్ అందుకొని ప్రభాస్ స్టామినా ఏంటో మరోసారి బాలీవుడ్ కి చూపించింది. సలార్ చిత్రం ఇండియా వైడ్ దాదాపు 89 కోట్ల వరకు గ్రాస్ అందుకున్నట్లు సమాచారం. ఇక వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం దాదాపు 175 కోట్ల గ్రాస్ ని అందుకుందని చెబుతున్నారు.

Also read : సలార్‌లో కనిపించిన ఖాన్సార్ సిటీ ఎక్కడుందో తెలుసా?

ఈ ఏడాది టాప్ గ్రాసర్ గా నిలిచిన షారుఖ్ ‘జవాన్’ చిత్రం మొదటిరోజు 129 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుంది. ఈ మూవీ కలెక్షన్స్ సలార్ ఫస్ట్ డే కలెక్షన్స్ కి చాలా డిఫరెన్స్ ఉంది. ఈ చిత్రంతో ప్రభాస్ మరోసారి బాలీవుడ్ లో రికార్డు సృష్టించడానికి సిద్దమవుతున్నట్లు ఉంది. కాగా సలార్ చిత్రం షారుఖ్ ‘డంకీ’ కూడా రిలీజ్ అయ్యింది. ఆ చిత్రం మొదటిరోజు ఇండియా వైడ్ 60 కోట్ల గ్రాస్ ని మాత్రం రాబట్టింది. ముంబైలో కొన్ని థియేటర్స్ లో డంకీ మూవీ తీసేసి సలార్ ని ఆడిస్తున్నారు.