Salaar : సలార్ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఎన్ని కోట్లు కలెక్ట్ చేయాలి..? ఇప్పటివరకు ఎంత వచ్చాయి..?

బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురిపిస్తున్న సలార్.. బ్రేక్ ఈవెంట్ సాధిస్తుందా..? అది క్రాస్ చేయాలంటే ఎంత కలెక్ట్ చేయాలి.

Prabhas Salaar Part 1 Cease Fire need this mark collections to do break even

Salaar : ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో ప్రశాంత్ నీల్ రెండు భాగాలుగా రూపొందించిన చిత్రం ‘సలార్’. డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చిన పార్ట్ 1 సీజ్ ఫైర్ థియేటర్స్ లో భారీ విజయం సాధించింది. ప్రభాస్ మాస్ కట్ అవుట్ కి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురుస్తుంది. మొదటి రోజే ఈ చిత్రం వరల్డ్ వైడ్ ఏకంగా 178.7 కోట్ల గ్రాస్ ని అందుకొని రికార్డ్ సెట్ చేయగా.. ఇప్పటివరకు 625 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 200 కోట్ల పైగా కలెక్షన్స్ ని అందుకున్న ఈ చిత్రం నార్త్ స్టేట్ లో 100 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టింది. ఇక ఓవర్ సీస్ మార్కెట్ నార్త్ అమెరికాలో దాదాపు 8 మిలియన్ డాలర్స్ అందుకున్న ఈ చిత్రం.. ఆస్ట్రేలియాలో 1.5 మిలియన్ డాలర్స్ వరకు అందుకుంది. ఇలా వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం 625 కోట్ల వరకు వసూళ్లు రాబట్టింది. కాగా ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 345 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు సమాచారం.

Also read : The India House : రామ్‌చరణ్‌తో నిఖిల్ ఓ రేంజ్‌లో ప్లాన్ చేస్తున్నాడుగా.. ప్రీ విజువలైజేషన్ వీడియో అదుర్స్..

అంటే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే.. 347 కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్, సుమారు 700 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టాలి. ఇప్పటివరకు వచ్చిన కలెక్షన్స్ బట్టి చూస్తే.. ఈ చిత్రం సుమారు 40 కోట్ల షేర్ ని అంటే 80 కోట్ల గ్రాస్ ని అందుకోవాల్సి ఉంది. మరి ఈ వీక్ తో సలార్ ఆ కలెక్షన్స్ ని అందుకొని బ్రేక్ ఈవెన్ సాధిస్తుందా లేదా అనేది చూడాలి. కాగా వచ్చే వారంతో సంక్రాంతి సినిమాల సందడి మొదలుకాబోతుంది.

ఆ తరువాత సలార్ కలెక్షన్స్ కి దెబ్బపడింది. అయితే ఈలోపు సలార్.. మంచి కలెక్షన్స్ రాబట్టి 1000 కోట్ల మార్క్ ని చేరుకుంటుందా లేదా అనేది చూడాలి. ఈమధ్యలో టాలీవుడ్ తో బాలీవుడ్ లో కూడా పెద్దగా సినిమాల రిలీజ్ లు ఏం లేవు.