The India House : రామ్‌చరణ్‌తో నిఖిల్ ఓ రేంజ్‌లో ప్లాన్ చేస్తున్నాడుగా.. ప్రీ విజువలైజేషన్ వీడియో అదుర్స్..
‘ది ఇండియా హౌస్’ కోసం రామ్‌చరణ్‌తో నిఖిల్ గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడుగా. ప్రీ విజువలైజేషన్ వీడియో అదిరిపోయింది.

Ram Charan Nikhil Siddhartha The India House pre production video released
The India House : మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌తో కలిసి టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘ది ఇండియా హౌస్’. అభిషేక్ అగర్వాల్, రామ్ చరణ్, విక్రమ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని రామ్ వంశీ కృష్ణ డైరెక్ట్ చేస్తున్నారు. బ్రిటిష్ రూలింగ్ సమయంలో ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్స్ కొంతమంది.. బ్రిటిష్ గడ్డ పై ఏర్పాటు చేసిన గూఢచారి సమావేశం గృహమే ‘ఇండియన్ హౌస్’. ఆ హౌస్ నేపథ్యంతో ఈ మూవీ కథ సాగబోతోంది.
ఇక అప్పటి పరిస్థితులకు అద్దం పట్టేలా సినిమాని తెరకెక్కించబోతున్నారు. ఈక్రమంలోనే ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ని పక్కాగా చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కి సంబంధించిన ఓ వీడియోని రిలీజ్ చేశారు. ఆ వీడియోలో సినిమా కోసం మూవీ టీం ఎంత రీసెర్చ్ చేస్తుందో చూపించారు. అలాగే సినిమాలో కొన్ని సీన్స్ గ్రాఫిక్స్ పై తియనున్నారని తెలుస్తుంది. అందుకోసం ప్రీ విజవలైజేషన్ వీడియోని క్రియేట్ చేసి ముందుగానే నటీనటులకు ట్రైనింగ్ ఇస్తున్నారు.
Also read : Prabhas : ‘సలార్’ సక్సెస్ పై మొదటిసారి స్పందించిన ప్రభాస్.. డార్లింగ్స్ అంటూ..
ఇప్పుడు రిలీజ్ చేసిన ఈ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ వీడియో మూవీ పై మరింత అంచనాలను క్రియేట్ చేస్తుంది. ఇక ఇది చూసిన నెటిజెన్స్.. రామ్‌చరణ్‌తో నిఖిల్ గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా రామ్ చరణ్ ‘వి మెగా పిక్చర్స్’ స్థాపించి నిర్మాణంలోకి దిగింది.. కొత్త వారిని, కొత్త టాలెంట్ ని యంకరేజ్ చేయడానికి. ఈక్రమంలోనే ఈ సినిమా కోసం దాదాపు చాలావరకు కొత్తవారికి అవకాశం ఇస్తున్నారు.
ఇటీవల ఈ సినిమా కోసం కొత్త నటీనటులు కావాలంటూ ఒక ఆడిషన్ నోటీసు రిలీజ్ చేయగా.. 8000 పైగా అప్లికేషన్స్ వచ్చాయట. వారిలో దాదాపు 500 పైగా ఎంపిక చేశారట. మరి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలుపెడతారో చూడాలి. ప్రస్తుతం నిఖిల్.. ‘స్వయంభు’ అనే సినిమా చేస్తున్నారు.