Prabhas : ‘సలార్’ సక్సెస్ పై మొదటిసారి స్పందించిన ప్రభాస్.. డార్లింగ్స్ అంటూ..

సలార్ సక్సెస్ పై ఇప్పటికే చిత్రయూనిట్ అంతా మాట్లాడగా మొదటి సారి ప్రభాస్ ఈ సినిమా విజయంపై స్పందించాడు.

Prabhas : ‘సలార్’ సక్సెస్ పై మొదటిసారి స్పందించిన ప్రభాస్.. డార్లింగ్స్ అంటూ..

Prabhas First Reaction on Salaar Part 1 Cease Fire Movie Success

Updated On : January 1, 2024 / 2:34 PM IST

Prabhas : ప్రశాంత్ నీల్(Prashanth Neel) దర్శకత్వంలో ప్రభాస్(Prabhas) సలార్(Salaar) సినిమాతో గతవారం డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. పార్ట్ 1 సీజ్ ఫైర్ థియేటర్స్ లో భారీ విజయం సాధించింది. సలార్ సినిమాతో ప్రభాస్ మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ సునామి సృష్టిస్తున్నాడు. సలార్ సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ ఏకంగా 178.7 కోట్ల గ్రాస్ ని అందుకొని సరికొత్త రికార్డ్ సెట్ చేయగా ఇప్పటివరకు దాదాపు 600 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది సలార్ సినిమా. థియేటర్స్ లో ఈ సినిమా ఇంకా సందడి చేస్తుంది.

బాహుబలి తర్వాత ఆ రేంజ్ లో కలెక్షన్స్, సక్సెస్ రావడంతో ప్రభాస్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పట్నుంచే బాహుబలి 1 తర్వాత పార్ట్ 2 కోసం ఎదురు చూసినట్టు సలార్ పార్ట్ 2 కోసం కూడా ఎదురు చూస్తున్నారు. సలార్ సక్సెస్ పై ఇప్పటికే చిత్రయూనిట్ అంతా మాట్లాడగా మొదటి సారి ప్రభాస్ ఈ సినిమా విజయంపై స్పందించాడు.

Also Read : Star Hero Big Movies : 2024లో రాబోయే తెలుగు స్టార్ హీరోల భారీ సినిమాలు ఇవే..

సలార్ సినిమాలోని ఓ ఫోటోని తన ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి.. నేను ఖాన్సార్ భవిష్యత్తుని నిర్ణయించేటప్పుడు మీరు రిలాక్స్ గా కూర్చొని న్యూ ఇయర్ ని ఎంజాయ్ చేయండి. సలార్ సీజ్ ఫైర్ ని ఇంత పెద్ద సక్సెస్ చేసి, సినిమాని మీ సొంతం చేసుకున్నందుకు థ్యాంక్స్ డార్లింగ్స్ అని పోస్ట్ చేశాడు. దీంతో ప్రభాస్ ఇలా సినిమా సక్సెస్ పై పోస్ట్ చేయడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.

View this post on Instagram

A post shared by Prabhas (@actorprabhas)