Prabhas : నా కెరీర్లో బిగ్గెస్ట్ సాంగ్స్‌లో అది ఒకటి.. వాళ్ళు ఇప్పుడు లేరా అనిపిస్తుంది.. ప్రభాస్ ఎమోషనల్..

ఈ ఇంటర్వ్యూకి పలువురు ప్రముఖులు రాగా తాజాగా ప్రభాస్ కూడా వచ్చారు.

Prabhas : నా కెరీర్లో బిగ్గెస్ట్ సాంగ్స్‌లో అది ఒకటి.. వాళ్ళు ఇప్పుడు లేరా అనిపిస్తుంది.. ప్రభాస్ ఎమోషనల్..

Prabhas Speaking About his Career best Song and Remembering SP Balu Sirivennela

Updated On : October 24, 2024 / 11:16 AM IST

Prabhas : ఎన్నో అద్భుతమైన అర్థవంతమైన పాటలు రాసి ప్రేక్షకులని మెప్పించిన దివంగత పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రిని స్మరిస్తూ ఈటీవి ఛానల్ నా ఉఛ్వాసం కవనం అనే ఓ ఇంటర్వ్యూ సిరీస్ చేస్తుంది. ఈ ఇంటర్వ్యూకి పలువురు ప్రముఖులు రాగా తాజాగా ప్రభాస్ కూడా వచ్చారు. ప్రభాస్ పుట్టిన రోజు సందరభంగా నిన్న రాత్రి ఈ ఇంటర్వ్యూ పార్ట్ 1 ఈటీవి విన్ యాప్ లో రిలీజ్ చేసారు.

ఈ ఇంటర్వ్యూలో సిరివెన్నెల సీతారామశాస్త్రితో ప్రభాస్ కి ఉన్న అనుబంధం గురించి మాట్లాడారు. అలాగే ఆయన ప్రభాస్ కోసం రాసిన పలు పాటల గురించి చర్చించారు. ఈ క్రమంలో పౌర్ణమి సినిమాలోని ‘మువ్వలా నవ్వకలా ముద్ద మందారమా..’ సాంగ్ ప్రస్తావన వచ్చింది.

Also Read : Prabhas : ఆ సాంగ్ పోయినట్టే అనుకున్నా.. కానీ నా ఫేవరేట్ సాంగ్ అయింది.. ప్రభాస్ తన పాట గురించి ఏమన్నారంటే..

ఈ పాట గురించి ప్రభాస్ స్పందిస్తూ.. గ్రేట్ జీనియస్, లెజెండ్ బాలు గారు పాడారు. నా కెరీర్ లో బిగ్గెస్ట్ సాంగ్స్ లో అది ఒకటి. సిరివెన్నెల గారు రాసారు. వాళ్ళ కాంబోలో ఆ పాట బాగా వచ్చింది. వాళ్ళు పోయాక వాళ్ళ విలువ ఇంకా తెలుస్తుంది. బాలు గారు, సిరివెన్నెల గారు ఇప్పుడు లేరా అని అప్పుడప్పుడు అనిపిస్తుంది అంటూ చిన్నగా ఎమోషనల్ అయ్యారు.