Prabhas : ఆ సాంగ్ పోయినట్టే అనుకున్నా.. కానీ నా ఫేవరేట్ సాంగ్ అయింది.. ప్రభాస్ తన పాట గురించి ఏమన్నారంటే..

ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా నిన్న రాత్రి ఈ ఇంటర్వ్యూ పార్ట్ 1 ఈటీవి విన్ యాప్ లో రిలీజ్ చేసారు.

Prabhas : ఆ సాంగ్ పోయినట్టే అనుకున్నా.. కానీ నా ఫేవరేట్ సాంగ్ అయింది.. ప్రభాస్ తన పాట గురించి ఏమన్నారంటే..

Prabhas Favourite Song Revealed in special Interview do you know that song

Updated On : October 24, 2024 / 10:45 AM IST

Prabhas Favourite Song : ఎన్నో అద్భుతమైన పాటల్ని రాసిన సిరివెన్నెల సీతారామశాస్త్రిని స్మరిస్తూ ఈటీవి ఛానల్ నా ఉఛ్వాసం కవనం అనే ఓ ఇంటర్వ్యూ సిరీస్ చేస్తుంది. ఈ ఇంటర్వ్యూకి తాజాగా ప్రభాస్ వచ్చారు. ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా నిన్న రాత్రి ఈ ఇంటర్వ్యూ పార్ట్ 1 ఈటీవి విన్ యాప్ లో రిలీజ్ చేసారు. ఇందులో సిరివెన్నెల సీతారామశాస్త్రి తో ప్రభాస్ కి ఉన్న అనుబంధం గురించి మాట్లాడారు.

ప్రభాస్ కి సిరివెన్నెల రాసిన పాటల గురించి చర్చించారు. ఈ క్రమంలో వర్షం సినిమా పాటల గురించి ప్రభాస్ మాట్లాడుతూ.. నాకు ఈశ్వర్ సమయంలో లిరిక్స్ గురించి అంత అవగాహన లేదు. నా మొదటి సినిమాలో కూడా సిరివెన్నెల గారు సాంగ్ రాసారని విన్నాను కానీ ఆయన్ని కలవలేదు. మొదటిసారి ఆయన్ని వర్షం సినిమా సమయంలో కలిసాను. అప్పుడే లిరిక్స్, వాటి అర్దాల గురించి తెలిసింది. నిర్మాత MS రాజు గారి ఆఫీస్ లో సీతారామశాస్త్రి గారిని మొదటిసారి కలిసాను. ఆయన రాసిన పాట తన బేస్ వాయిస్ తో ‘మెల్లగా కరగని..’ అని వినిపించారు. దాంతో ఈ సాంగ్ పోయినట్టే, ఈ సాంగ్ ఏదో తేడాగా ఉందని అనుకున్నాను. ఆ తర్వాత దేవిశ్రీ ప్రసాద్, నేను కలిసి ఈ వర్షం సాక్షిగా ప్లేస్ లో ఐ లవ్ యు శైలజ అనే లిరిక్ పెట్టాము. కానీ చివరకు సిరివెన్నెల గారు రాసింది రికార్డ్ అయ్యాక విన్నాము. ఆ తర్వాత మెల్లగా కరగని.. సాంగ్ నా ఫేవరేట్ సాంగ్ అయిపొయింది అని తెలిపారు ప్రభాస్.

Also Read : Prasanth Neel – Sri Murali : ప్రశాంత్ నీల్ బావ.. కన్నడలో స్టార్ హీరో.. ఇప్పుడు తెలుగులో ఎంట్రీ..

సూపర్ హిట్ వర్షం సినిమాలో ప్రభాస్ – త్రిష మధ్య వర్షంలో వచ్చే ఈ సాంగ్ ఎంత బాగుంటుందో అందరికి తెలిసిందే. ఆ పాటని దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వంలో SP చరణ్, సుమంగళి పాడారు. ఇప్పటికి ఆ పాటని విన్నా ఒక ఫీల్ గుడ్ సాంగ్ లా అనిపిస్తుంది.