Prasanth Neel – Sri Murali : ప్రశాంత్ నీల్ బావ.. కన్నడలో స్టార్ హీరో.. ఇప్పుడు తెలుగులో ఎంట్రీ..

ప్రశాంత్ నీల్ బావ కన్నడలో స్టార్ హీరో. ఇప్పుడు అతను తెలుగులో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

Prasanth Neel – Sri Murali : ప్రశాంత్ నీల్ బావ.. కన్నడలో స్టార్ హీరో.. ఇప్పుడు తెలుగులో ఎంట్రీ..

Prasanth Neel Brother in Law Kannada Roaring Star Sri Murali entry in Telugu with Bagheera Movie

Updated On : October 24, 2024 / 8:03 AM IST

Prasanth Neel – Sri Murali : ఉగ్రం సినిమాతో డైరెక్టర్ గా మారిన ప్రశాంత్ నీల్ ఆ తర్వాత KGF సినిమాలతో పాన్ ఇండియా డైరెక్టర్ అయ్యాడు. అనంతరం ప్రభాస్ తో సలార్ సినిమాతో భారీ హిట్ కొట్టాడు. తక్కువ సినిమాలతోనే స్టార్ డైరెక్టర్ అయ్యాడు ప్రశాంత్ నీల్. త్వరలో ఎన్టీఆర్ తో, ఆ తర్వాత సలార్ 2, ఆ తర్వాత KGF 3 సినిమాలు చేయబోతున్నాడు ప్రశాంత్ నీల్. ప్రశాంత్ నీల్ బావ కన్నడలో స్టార్ హీరో. ఇప్పుడు అతను తెలుగులో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

కన్నడలో శ్రీ మురళి తన మొదటి సినిమా చంద్ర చకోరి తోనే భారీ విజయం సాధించాడు. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ రోరింగ్ స్టార్ అనిపించుకున్నాడు కన్నడలో. 2008లో శ్రీ మురళికి ప్రశాంత్ నీల్ అక్క విద్యతో పెళ్లి అయింది. ప్రశాంత్ నీల్ కి మొదట అవకాశం ఇచ్చింది కూడా శ్రీ మురళినే. ప్రశాంత్ నీల్ మొదటి సినిమా ఉగ్రం లో హీరో శ్రీ మురళినే.

Also Read : Suriya – Balakrishna : ‘సింగం’ వర్సెస్ ‘సింహా’.. బాలయ్య అన్‌స్టాపబుల్ షోలో..

అయితే శ్రీ మురళి ఇప్పుడు బఘీర సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమాని పాన్ ఇండియా రిలీజ్ చేస్తుండటంతో తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు. దీంతో శ్రీ మురళి తెలుగులో కూడా ప్రమోషన్స్ చేసారు. ఈ బఘీర సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 31న రిలీజ్ కానుంది. ఈ సినిమాకి ప్రశాంత్ నీల్ కథ అందించడం గమనార్హం.

Image

శ్రీ మురళి ఈ సినిమా కోసం మూడేళ్లు కష్టపడ్డాడు. ఫుడ్, డైట్ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాడు. షూట్ సమయంలో కాలికి గాయం అయితే 8 నెలలు పట్టింది కోలుకోవడానికి. మరి ఇన్ని కష్టాలు పడి తీసిన బఘీర సినిమా కన్నడతో పాటు తెలుగులో ఎలా ఆడుతుందో, ప్రశాంత్ నీల్ బావకు తెలుగు ఆడియన్స్ ఎలా వెల్కమ్ చెప్తారో చూడాలి.