Suriya – Balakrishna : ‘సింగం’ వర్సెస్ ‘సింహా’.. బాలయ్య అన్‌స్టాపబుల్ షోలో..
ఈసారి అన్‌స్టాపబుల్ షోలో సింగం వర్సెస్ సింహా తలపడబోతున్నాయట.

Tamil Star Hero Suriya coming soon to Aha Balakrishna Unstoppable Show Rumours goes Viral
Suriya – Balakrishna : బాలయ్య హోస్ట్ గా వచ్చిన అన్‌స్టాపబుల్ షో ఇప్పుడు సీజన్ 4 రాబోతుంది. అక్టోబర్ 25 నుంచి ఈ షో మొదలు కానుంది. మొదటి ఎపిసోడ్ లో ఏపీ సీఎం చంద్రబాబు నాయిడు రానున్నారు. ఇప్పటికి దీనికి సంబంధించిన ప్రోమో కూడా విడుదల చేయగా ఈ షోపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అన్‌స్టాపబుల్ షో సీజన్ 4కి ఆల్రెడీ మరికొన్ని ఎపిసోడ్స్ కూడా షూట్ అయిపోయాయని సమాచారం.
తాజాగా అన్‌స్టాపబుల్ లీకుల నుంచి మరో సమాచారం వచ్చింది. ఈసారి అన్‌స్టాపబుల్ షోలో సింగం వర్సెస్ సింహా తలపడబోతున్నాయట. అంటే సూర్య వర్సెస్ బాలయ్య షోలో ఎంటర్టైన్మెంట్ ఇవ్వనున్నారట. తమిళ్ స్టార్ హీరో సూర్య ఇప్పటికి అనేక సినిమాలతో తెలుగులో కూడా స్టార్ హీరో హోదా దక్కించుకొని మంచి మార్కెట్ సంపాదించుకున్నాడు. త్వరలో నవంబర్ 14న కంగువ సినిమాతో రాబోతున్నాడు సూర్య.
కంగువ ప్రమోషన్స్ లో భాగంగా సూర్య బాలయ్య హోస్ట్ చేస్తున్న ఆహా అన్‌స్టాపబుల్ షోకి గెస్ట్ గా రాబోతున్నారట. దీనికి సంబంధించిన షూట్ నేడు అక్టోబర్ 24న జరగబోతున్నట్టు సమాచారం. దీంతో సింగం లాంటి పవర్ ఫుల్ మాస్ క్యారెక్టర్స్ తో మెప్పించిన సూర్య ప్రతి సినిమాలో సింహంలా గర్జించే మన బాలయ్యతో కలిసి అన్‌స్టాపబుల్ లో ఏ రేంజ్ లో సందడి చేస్తారో చూడాలి.