Prabhas Special Interview on His Birthday Promo goes Viral Watch Here
Prabhas : ప్రభాస్ పుట్టిన రోజు అక్టోబర్ 23 కావడంతో ఇప్పట్నుంచే ఫ్యాన్స్ హంగామా మొదలైంది. ఇక ప్రభాస్ చేసే సినిమాల నుంచి ఏం అప్డేట్స్ వస్తాయా అని ఎదురుచూస్తున్నారు. అయితే ప్రభాస్ పుట్టిన రోజు నాడు ఓ స్పెషల్ ఇంటర్వ్యూ రాబోతుంది.
ఎన్నో పాటలతో ప్రేక్షకులని మెప్పించారు సిరివెన్నెల సీతారామశాస్త్రి. ఆయన లేకపోయినా ఆయన పాటలు ఇప్పటికి వింటూనే ఉంటున్నాము. ఎన్నో పాటల్లో ఎంతో అర్థవంతమైన భావాలతో ప్రేక్షకుల మనసులను కదిలించారు సిరివెన్నెల. సిరివెన్నెల సీతారామశాస్త్రిని స్మరిస్తూ ఈటీవి ఛానల్ నా ఉఛ్వాసం కవనం అనే ఓ ఇంటర్వ్యూ సిరీస్ చేస్తుంది.
ఈ ఇంటర్వ్యూకి గతంలో పలువురు సెలబ్రిటీలు రాగా ప్రభాస్ కూడా వచ్చాడు. ఇప్పటికే ఈ ఇంటర్వ్యూ షూట్ అవ్వగా తాజాగా ప్రోమో రిలీజ్ చేసారు. ఈ ప్రోమోలో ప్రభాస్ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారితో ఉన్న అనుబంధం, ఆయన రాసిన పాటల గురించి, ఆయన సాహిత్యం గురించి మాట్లాడారు. దీంతో ఈ ప్రోమో వైరల్ గా మారింది.
అయితే ప్రతి ఆదివారం ఈ ఇంటర్వ్యూ ని రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రభాస్ పుట్టిన రోజు అక్టోబర్ 23 ఉండటంతో ఆ రోజే ఈ ఇంటర్వ్యూని విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ ప్రోమో చూసి ప్రభాస్ కి సాహిత్యం పై ఇంత పట్టు ఉందా అని ఆశ్చర్యపోతున్నారు అంతా. ప్రభాస్ ఫ్యాన్స్ ఈ ఇంటర్వ్యూ కోసం ఎదురుచూస్తున్నారు. మీరు కూడా ఈ ప్రోమో చూసేయండి..
Dear Darling Fans,
The wait is over 😉…
Stay tuned to @etvwinMa team Sunday antunnaru mari 👀
5k retweets vasthe munde release chesta 🤭😉#Prabhas #Etvwin pic.twitter.com/NHfDgeKEaW— ETV Win (@etvwin) October 21, 2024