Ananya Nagalla : అనన్య నాగళ్ళ సినిమాల్లోకి రాకముందు ఏం చేసిందో తెలుసా..? అప్పటి కొలీగ్‌తో ఇప్పుడు హీరోయిన్‌గా..
అనన్య నాగళ్ళ మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.

Ananya Nagalla Says about her Work before Enter into Movies
Ananya Nagalla : మల్లేశం సినిమాతో సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన తెలుగమ్మాయి అనన్య నాగళ్ళ ఆ తర్వాత వకీల్ సాబ్, ప్లే బ్యాక్, శాకుంతలం, అన్వేషి, తంత్ర, డార్లింగ్.. ఇలా వరుస సినిమాలు చేస్తూ దూసుకెళ్తుంది. త్వరలో పొట్టేల్ సినిమాతో అనన్య ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల మెయిన్ లీడ్స్ లో సాహిత్ మోత్ఖూరి దర్శకత్వంలో తెరకెక్కిన ‘పొట్టేల్’ సినిమా అక్టోబర్ 25న రిలీజ్ కాబోతుంది.
ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నేడు అనన్య నాగళ్ళ మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఈ క్రమంలో అనన్య నాగళ్ళ మాట్లాడుతూ.. సినిమాలోకి రాకముందు ఇన్ఫోసిస్ లో సాఫ్ట్ వేర్ జాబ్ చేశాను. ఈ సినిమా హీరో యువచంద్ర కూడా అక్కడే పనిచేసేవాడు. అప్పట్లో యువ షార్ట్ ఫిలిమ్స్ తీసేవాళ్ళు. వీళ్ళను చూసి నేను కూడా ఇన్‌స్పైర్ అయి సినిమాల్లోకి వద్దాం అనే ఆలోచన వచ్చింది అని తెలిపింది.
అలాగే.. జాబ్ మానేసి సినిమాల్లోకి వచ్చాక మల్లేశం, వకీల్ సాబ్ అవ్వగానే కరోనా వచ్చి లాక్ డౌన్ వచ్చేసింది. చేతిలో సినిమాలు లేవు, జాబ్ లేవు. అప్పుడు అనవసరంగా సినిమాల్లోకి వచ్చాను అని ఫీల్ అయ్యాను. ఒక సంవత్సరం పాటు ఖాళీగానే ఉన్నాను. కానీ ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తున్నాను అని తెలిపింది. ఒకప్పుడు తన సాఫ్ట్ వేర్ కంపెనీలో తన కొలీగ్ గా పనిచేసిన వ్యక్తితోనే ఇప్పుడు అనన్య హీరోయిన్ గా సినిమా చేయడం విశేషం.