Sobhita – Naga Chaitanya : పెళ్లి పనులు మొదలుపెట్టిన శోభిత.. ఫొటోలు వైరల్.. త్వరలోనే నాగచైతన్య – శోభిత పెళ్లి..?
తాజాగా శోభిత ధూళిపాళ ఇంట్లో పసుపు కొట్టే కార్యక్రమం జరిగింది.

Sobhita Naga Chaitanya Wedding Soon Wedding Works Started in Sobhita House
Sobhita – Naga Chaitanya : నాగ చైతన్య, శోభిత ధూళిపాళ ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి నిశ్చితార్థం ఫొటోలు వైరల్ గా మారాయి.
అయితే ఈ జంట ఎప్పుడు పెళ్లి చేసుకుంటారా అని అందరూ ఎదురుచూస్తున్నారు.
తాజాగా శోభిత పలు ఫొటోలు పోస్ట్ చేసి పెళ్లి పనులు మొదలు పెట్టమని తెలిపింది.
తాజాగా శోభిత ధూళిపాళ ఇంట్లో పసుపు కొట్టే కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమంలో శోభిత చక్కగా చీర కట్టుకొని అలరించింది. శోభిత ఫ్యామిలీ, బంధువులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
పసుపు కొట్టారు అంటే పెళ్లి పనులు మొదలయినట్టే దీంతో త్వరలోనే శోభిత – నాగచైతన్య పెళ్లి ఉండబోతుంది అని తెలుస్తుంది.
శోభిత ఈ ఫోటోలను షేర్ చేసి.. గోధుమ రాయి, పసుపు దంచడం.. పనులు మొదలయ్యాయి అని పోస్ట్ చేసింది. దీంతో ఈ ఫొటోలు వైరల్ గా మారాయి.
మరి ఈ జంట పెళ్లి ఎప్పుడు చేసుకుంటారో, నాగచైతన్య ఇంట్లో పెళ్లి పనులు ఎప్పుడు మొదలుపెడతారో అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.